యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న సినిమా నాన్నకు ప్రేమతో.. శ్రీ వెంకటేశ్వర సిని క్రియేషన్స్ పతాకంలో బోగవల్లి ప్రసాద్ ఈ సినిమా నిర్మిస్తుండగా.. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాకు విడుదలకు సంబంధించి తనకే ఏం అర్ధం కాని సంకోచం ఏర్పడిందని.. సినిమా ఆడియో, విడుదల విషయాల పట్ల తనకే ఓ క్లారిటీ లేదని ఎన్టీఆర్ తన ట్విట్టర్ లో సందేశాన్ని పొందుపరచడం ఇప్పుడు హాట్ న్యూస్ అయ్యింది.
నాన్నకు ప్రేమతో గురించి వింతగా స్పందించడం పట్ల అలర్ట్ అయిన చిత్ర యూనిట్ ఎన్టీఆర్ కి ఆ విషయాన్ని చెప్పారట. అప్పుడు తెలిసింది అసలు విషయం. ఎన్టీఆర్ ట్విట్టర్ ఎకౌంట్ హ్యాక్ అయ్యిందని. వెంటనే లైన్ లోకి వచ్చిన తారక్ తన ట్విట్టర్ ఎకౌంట్ హ్యాక్ చేశారని..తన టీం తో చర్చించి ట్విట్టర్ ఎకౌంట్ హ్యాక్ అవ్వడానికి గల కారణాలు తెలుసుకుంటానని మరో మెసేజ్ పోస్ట్ చేశాడు.
అయితే హ్యాకర్ పెట్టిన ఆ మెసేజ్ అప్పటికే చాలా మంది అభిమానుల దగ్గరకు వెళ్లిందని.. ఆ విషయంలో వారంతా ఆశ్చర్యంలో ఉన్నారని తెలుస్తుంది. ఎన్టీఆర్ వివరణ ఇచ్చినా అభిమానులు మాత్రం సినిమా విడుదల ఎప్పుడు అనే విషయంపై ఇంకా గందరగోళంగానే ఉన్నారు. ప్రస్తుతం స్పెయిన్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్ర యూనిట్ కు ట్విట్టర్ షాక్ కి అందరు అవాక్కయ్యారట.