ఎనర్జిటిక్ హీరో రామ్.. పేరుకే కాదు కుర్రాడిలో కూడా మంచి కసి కనపడుతుంది. అయితే హీరోగా తెరంగేట్రం చేసిన కొత్తలో మంచి ప్రతిభ కనబరచిన రామ్ ఈ మధ్య ఎందుకో అంతలా ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాడు. ఈ సంవత్సరం రామ్ కి అసలు కలిసి రాలేదనే అనాలి. పండగ చేస్కో పర్వాలేదనిపించినా రొటీన్ సినిమానే అన్నారు. ఇక శివం అయితే భారీ మూల్యాన్ని చెళ్లించుకున్నాడు రామ్.
అందుకే ప్రస్తుతం ఓ మంచి ప్రేమకథతో నేను..శైలజా అంటూ వస్తున్నాడు. శ్రీ స్రవంతి రవికిశోర్ ఇంతకుముందు నిర్మించిన నువ్వేకావాలి, నువ్వు నాకు నచ్చావ్, నువ్వే నువ్వే సినిమాల్లా ఇది కూడా మంచి సినిమా అవుతుందని చెప్పిన రామ్… కొద్ది కాలంగా రొటీన్ సినిమాలే చేస్తున్నాయని అంటున్నారు అవి నాకు గట్టిగా వినపడ్డాయ్. అందుకే కాస్త కొత్తగా ప్రయత్నించి నేను శైలజాతో వస్తున్నా అన్నాడు.
ఒక రచయిత దర్శకుడు అయితే ఆ సినిమా ప్రత్యేకంగా ఉంటుంది. కిశోర్ తిరుమల కూడా మంచి దర్శకుడవుతాడని అని అభిప్రాయపడ్డాడు. సో దీన్ని బట్టి చూస్తే రామ్ ఈ సినిమాకు బాగా కష్టపడి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడని తెలుస్తుంది. జనవరి 1న విడుదలవుతున్న ఈ సినిమా రామ్ కోరికను నెరవేర్చిందో లేదో చూద్దాం.