హైదరాబాద్: హైదరాబాద్లో జోరుగా సాగుతున్న ఇళ్ళ క్రమబద్ధీకరణ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురయింది. తదుపరి ఆదేశాలు జారీచేసేవరకు ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ విషయంలో ఎలాంటి చర్యలూ చేపట్టొద్దని హైకోర్ట్ జీహెచ్ఎంసీకి ఆదేశాలు జారీ చేసింది. దరఖాస్తుల స్వీకరణ కొనసాగించొచ్చని తెలిపింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన పిటిషన్పై స్పందిస్తూ హైకోర్ట్ ఈ ఆదేశాలనిచ్చింది. ఈ క్రమబద్ధీకరణ అక్రమార్కులను ప్రోత్సహించేటట్లు ఉందని పిటిషనర్ వాదించారు. అక్రమార్కులను చట్టం ముందు నిలబెట్టాలని పేర్కొన్నారు.