మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కోసం పూరి జగన్నాథ్ ఓ కథ రాసుకుని ఆయనకు వినిపించడం మొదటి సగం ఓకే కాని రెండవ సగం మార్చాలని అభిప్రాయపడి ఆ సినిమా నుండి పూర్తిగా తప్పుకోవడం జరిగిందే. ఆ సినిమా విషయంలో మెగా ఫ్యామిలీ ఇచ్చిన హ్యాండ్ కి పూరి ఘోరంగా బాధపడ్డాడు. అయితే చివరకు పూరిని కాదని కత్తి రీమేక్ గా వినాయక్ దర్శకత్వంలో చిరు సినిమా చేస్తున్నాడనుకోండి.
పూరి రాసుకున్న ఆ కథకు ఆటోజాని అనే టైటిల్ కూడా పెట్టుకున్నాడు. ఇప్పుడు అదే సినిమాను మాస్ మహరాజ్ రవితేజతో తీసే ప్రయత్నాలు చేస్తున్నాడట పూరి. పూరి, రవితేజల కలయికలో వచ్చిన సినిమాలన్ని మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం నుండి దేవుడు చేసిన మనుషులు దాకా ఇద్దరు చేసిన సినిమాల్లో ఒకటో రెండో తప్ప అన్ని ప్రేక్షకులను ఆకట్టుకున్నవే. అయితే పూరి రాసిన ఆటోజాని రవితేజతో తెరకెక్కించడానికి సిద్ధంయ్యాడట దర్శకుడు పూరి జగన్నాథ్.
లోఫర్ వరుణ్ కి మంచి పేరు తెచ్చినా సినిమా అపజయపాలై పూరికి మళ్లీ చెడ్డ పేరు తెచ్చి పెట్టింది. అందుకే ఈసారి రవితేజతో ఆటోజాని అంటూ వచ్చి మళ్లీ ఇద్దరు కలిసి మాయ చేయబోతున్నారట. ప్రస్తుతం రవితేజ కమిట్ అయిన సినిమాలు, పూరి తీస్తున్న రోగ్ పూర్తి చేసుకున్నాక ఆటోజానిని సెట్స్ మీదకు తీసుకెళ్తారట. మరి క్రేజీ కాంబోగా వస్తున్న ఈ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.