సినిమా హిట్ ఫ్లాప్ అనేది ఆడియెన్స్ మూడ్ ని బట్టి ఉంటుందంటే దానికి కొన్నిసార్లు దర్శక నిర్మాతలు కూడా రాజీ పడాల్సి వస్తుంది. ఎందుకంటే కథ కథనాల్లో కొత్తదనం లేకుంటే ప్రేక్షకులకు బోర్ కొట్టడం ఖాయం. అయితే ఇక్కడ ఓ చిన్న లాజిక్ ని మెయింటైన్ చేస్తే ఎలాంటి సినిమానైనా ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా చేయొచ్చు. వివరాల్లోకి వెళ్తే సినిమా నిడివి అనేది ఈ కాలంలో సినిమా ప్రేక్షకులకు చేరవేయడంలో పెద్ద పాత్ర పోషిస్తుంది.
సినిమా నిడివి తక్కువ ఉండి సినిమా మొదలైంది మొదలు చివరదాగా ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేస్తే చాలు సినిమా హిట్ అయినట్టే.. అయితే ఆ ఫార్ములాని పర్ఫెక్ట్ గా వాడుతున్నారు భలే మంచి రోజు దర్శకుడు శ్రీరాం ఆదిత్య. సుధీర్ బాబు, వామికా గబ్బి జంటగా నటించిన ఈ సినిమా రెండు రోజుల్లో ప్రేక్షకులముందుకు వస్తుంది. సినిమా ప్రమోషన్స్ కూడా భారీ రెంజ్లోనే చేస్తున్నారు.
ఒక్కరోజులో జరిగే సంఘటనల సమాహారంతో ఈ సినిమా తెరకెక్కించబడింది. 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో విజయ్ కుమార్ రెడ్డి, శడిధర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. మహేష్, ప్రభాస్ లను కూడా సినిమా ప్రమోషన్స్ లో వాడిన సుధీర్ ఈ సినిమాతో సూపర్ హిట్ కొడతాడో లేదో చూడాలి.