రెండు రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ముగిసాయి. జనవరి ఆఖరి వారంలో తెలంగాణా శాసనసభ సమావేశాలు మొదలవుతాయని స్పీకర్ మధుసుధానాచారి తెలిపారు. వరంగల్ జిల్లా చిట్యాలలో నిన్న ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ శాసనసభ సమావేశాలు వారం లేదా పది రోజులపాటు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఏర్పడిన కరువు సమస్యపై ఈ సమావేశాలలో చర్చించి తాగు చర్యలు తీసుకొంటామని తెలిపారు. జనవరి 28వ తేదీన జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక అవి జరిగిన తరువాతనే శాసనసభ సమావేశాలు మొదలయ్యే అవకాశం ఉంది. జనవరి 29 నుండి వారం పది రోజులు సమావేశాలు నిర్వహించవచ్చును.