హైదరాబాద్: ఈ నెల 18న అసెంబ్లీలో తమ పార్టీ ఎమ్మెల్యే రోజా టీడీపీకి చెందిన దళిత ఎమ్మెల్యే అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియో క్లిప్పింగ్స్ బయటకు రావటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ ఆ రోజు గొడవ తాలూకు మొత్తం వీడియోను విడుదల చేయాలని అసెంబ్లీ కార్యదర్శిని నిన్న కోరిన సంగతి తెలిసిందే. వారి అభ్యర్థన మేరకు ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు నిన్న సాయంత్రం ఆ గొడవ వీడియోను రిలీజ్ చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలని స్పీకర్ అనుమతితో ఈ వీడియోను విడుదల చేస్తున్నట్లు కాల్వ చెప్పారు. రోజాతో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ పట్ల అమర్యాద పూర్వకంగా ప్రవర్తించారని, బూతులు తిట్టారని, వారిపైనా చర్యలు తీసుకోవాలని కోరతామని అన్నారు. రోజా తనను చంపగలరా, రేప్ చేయగలరా అని ప్రశ్నించిందని చెప్పారు. రేప్ చేసే ధైర్యం లేదని, అయితే చంపాలి లేదా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని అంతకంటే ఏమీ పీకలేరని రోజా వ్యాఖ్యానించినట్లు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమకు తన చీర ఇస్తా కట్టుకోమని అందని చెప్పారు. బొండా తనను ఆంటీ అంటున్నాడని, ఆడేమైనా బొప్పా అని రోజా అన్నట్లు తెలిపారు. స్పీకర్‌నుద్దేశించి రౌడీ స్పీకర్ డౌన్ డౌన్ అని, ఫ్యాక్షన్ స్పీకర్ డౌన్ డౌన్ అని అన్నట్లు కాల్వ చెప్పారు. ఆ రోజు వీడియోలో వైసీపీ సభ్యుల మాటలు కింది విధంగా ఉన్నాయి.
వైసీపీ సభ్యులనందరినీ సస్పెండ్ చేసిన తర్వాత జరిగిన గొడవ ఈ వీడియోలో ఉంది. కొందరు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు… కొందరు నేలపై బైఠాయించారు. ఈ గొడవ జరుగుతున్నంతసేపూ జగన్ తన సీటులోనే ముసిముసిగా నవ్వుకుంటూ కూర్చున్నారు. మొదట అచ్చెన్నాయడునుద్దేశించి అచ్చా – లుచ్ఛా అని నినాదాలు చేయటం వినిపించింది. సెక్స్ సీఎం, డాక్టర్ సెక్స్ సీఎం అంటూ కొడాలి నాని, రోజా నినాదాలు చేశారు. మహిళల జీవితాలు నాశనం చేస్తున్న చంద్రబాబు డౌన్ డౌన్ అని, చంద్రబాబు నిరంకుశ వైఖరి నశించాలి అని, మహిళల జీవితాలను సర్వనాశనం చేస్తున్న చంద్రబాబు డౌన్ డౌన్ అని, కామ సీఎం డౌన్ డౌన్ అని, డాక్టర్ కామ సీఎం డౌన్ డౌన్ అని, సెక్స్ రాకెట్ సీఎం డౌన్ డౌన్ అని, కాల్ మనీ సీఎం డౌన్ డౌన్ అని, రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న చంద్రబాబు డౌన్ డౌన్ అని, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్న చంద్రబాబు డౌన్ డౌన్ అని రోజా నినాదాలు చేస్తుండగా ఇతర వైసీపీ సభ్యులు వంత పలికారు. మధ్యమధ్యలో రోజా కాగితాలు చింపి ముక్కలు గాలిలో విసిరారు. మమ్ములను సస్పెండ్ చేయటం అన్యాయం సార్ అని కొడాలి నాని స్పీకర్‌తో అన్నారు. తర్వాత రోజా అనితనుద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వినిపించాయి. ఈ సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు లేచి జగన్‌నుద్దేశించి సైకో అనినట్లున్నారు. అది వీడియోలో లేదుగానీ ఆ తర్వాత కనిపించిన వీడియోలో వైసీపీ నేతలు అచ్చెన్నాయుడుపై విరుచుకుపడ్డారు. కొడాలి నాని అచ్చెన్నాయుడునుద్దేశించి స్పీకర్ దగ్గరకు వెళ్ళి “సార్, వాడు అచ్చెన్నాయుడు సొల్లు సైకో గాడు సార్, కుక్కలాగా మొరుగుతున్నాడు సార్, వాడు ఎద్దులాగా పెరిగాడు సార్, సిగ్గులేని ముఖ్యమంత్రి” అని, ఎన్టీఆర్‌ను చంపిన వెధవలు వీళ్ళు, వీళ్ళా మాట్లాడేది, వీళ్ళు సన్నాసులు అని, అచ్చా లుచ్ఛా అని నినాదాలు చేశారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్పీకర్ దగ్గరకు వెళ్ళి “అసెంబ్లీకి గౌరవం ఉండదు సార్, వాడేం మాట్లాడుతున్నాడు సార్, లుచ్ఛా నాయాలు, అచ్చెన్నాయుడు దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు సార్” అన్నారు. ఆ తర్వాత దృశ్యాలలో రోజా నాలుకను మడతపెట్టి అరవటం ఎలాగో తోటి సభ్యులకు చూపించటం కనిపించింది.
[youtube https://www.youtube.com/watch?v=l-m9PWQzNEE&w=640&h=360]