ప్రేక్షకులు సినిమా అంటే కల్పితం అనే భావనలో ఉన్నా సృజనాత్మక విషయాలను వారు బాగా పరిశీలిస్తున్నారని ఈ మధ్య కొన్ని సినిమాల విజయాలు చెబుతున్నాయి. అయితే కొత్తదనం కోరుకుంటున్న తెలుగు ప్రేక్షకులకు కొత్తదనం ఇవ్వడం మానేసి దర్శక నిర్మాతలు ఇంకా ప్రేక్షకులను మాయ చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నది ఇప్పటి సినిమాలు చూస్తే అర్ధమవుతుంది. తనకున్న ప్రాబ్లమ్స్ మర్చిపోయి కాసేపు అలా ఎంటర్టైన్ అవుదామని థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులకు వారిని సేద తీరేలా చేయడం సరికదా వారికి మరో తలనొప్పి కలిగేలా చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
కమర్షియల్ అనే సినిమా భవనలో ఓ కథ అనుకుని దాన్ని కథనంగా చెప్పే విషయంలో ఇలాంటి సన్నివేశాలు వచ్చిన సినిమాల్లో రిపీట్ అయ్యాయా లేదా అనే విషయాన్ని మాత్రం మర్చిపోతున్నారు దర్శక నిర్మాతలు. సినిమా మొదలుపెట్టిన రోజు నుండి విడుదలయ్యేంతవరకు సినిమాపై భారీ అంచనాలను ఏర్పడేలా చేసి తీరా థియేటర్ కి వచ్చి సినిమా చూసేసరికి తుస్ మనిపించేస్తున్నారు.
ఈ మధ్య ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు చిన్న సినిమా అయినా సరే కథ కథనాల్లో కొత్తదనం ఉంటే సినిమాకు భారీ విజయాన్ని అందిస్తున్నారు. మరి దర్శక నిర్మాతలు కొత్త కొత్త ప్రయత్నాలు చేసి వారెవా తెలుగు సినిమా అనిపిస్తారో.. రెగ్యులర్ సినిమాలాంటివే తీసి తీసి సినిమా మీద అభిమానం ఉన్న కొద్ది మంది ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాకో దండం బాబోయ్ అనేలా చేస్తారో వారి చేతుల్లోనే ఉంది.