ప్రధాని నరేంద్ర మోడి ఎవరూ ఊహించని విధంగా కాబూల్ నుంచి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కి ఫోన్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా, ఆయన ఆహ్వానాన్ని మన్నించి దౌత్యపరమయిన పట్టింపులను పక్కన పెట్టి డిల్లీకి వెళ్తూ దారిలో లాహోర్ లో దిగి ఆయనను కలిసేందుకు అంగీకరించారు. అందుకు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆనందం వ్యక్తం చేస్తూ, ప్రధాని నరేంద్ర మోడికి స్వాగతం పలికేందుకు ఆయన కూడా దౌత్యపరమయిన పట్టింపులను పక్కనబెట్టి స్వయంగా లాహోర్ లోని అల్లామ ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్ళారు. కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోడి లాహోర్ లో దిగారు. ఆయనకు నవాజ్ షరీఫ్ ఎదురువెళ్ళి స్వాగతం పలికారు.