షిరిడి, తిరుపతి పుణ్యక్షేత్రాలను సందర్శించుకోవాలనుకొనే భక్తుల సౌకర్యార్ధం జనవరి 5వ తేదీ నుండి షిరిడి-తిరుపతి మధ్య రైలును నడుపబోతున్నారు. దానిని రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఇవ్వాళ్ళ లాంచనంగా తిరుపతిలో ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం వారానికి ఒక్కరోజు మాత్రమే ఈ రైలు నడిపిస్తారు కానీ మున్ముందు వారానికి రెండు లేదా మూడు రోజులకు పెంచే అవకాశం ఉంది. తిరుపతి, షిరిడిలోని సాయినాద్ నగర్ మధ్య ఈరైలు నడుస్తుంది.
తిరుపతి నుండి ప్రతీ మంగళవారం ఉదయం ఏడు గంటలకి బయలుదేరే ఈ రైలు (నెంబర్: 17417) మర్నాడు మధ్యాహ్నం 12.15 గంటలకు సాయినాథ్ నగర్ చేరుకొంటుంది.
మళ్ళీ ఈ రైలు (నెంబర్: 17418) ప్రతీ బుదవారం రాత్రి 7.10 గంటలకు సాయినాథ్ నగర్ నుండి బయలుదేరి గురువారం రాత్రి 11.45 గంటలకి తిరుపతికి చేరుకొంటుంది. జనవరి 5వ తేదీ నుండి ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. దీనివలన ఆ రెండు పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకొనే భక్తులకు, ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు జిల్లా భక్తులకు ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.