ప్రతిభ అందరికి ఉంటుంది కాని దాన్ని ప్రదర్శించడంలోనే దాని యొక్క ప్రతిఫలం ఉంటుందని తెలుస్తుంది. దర్శకుడు కావాలనే కల అందరికి ఉంటుంది కాని వచ్చిన అవకాశాన్ని నూటికి నూరు శాతం న్యాయం చేసి సక్సెస్ సాధిస్తేనే తర్వాత అవకాశాలు వస్తాయి. నిన్న విడుదల అయిన భలే మంచి రోజు సినిమా దర్శకుడు శ్రీరాం ఆదిత్య ఆ పనే చేశాడు. మొదటి సినిమా ఎలా తీయాలో ఏం తీయాలో అని తర్జన భర్జన అవకుండా మంచి ప్లానింగ్ తో సినిమా తీశాడు.
సుధీర్ బాబుతో భలే మంచి రోజు అని తీసి సినిమా మంచి టాక్ వచ్చేలా చేసుకున్నాడు. అయితే సినిమా హిట్టా ఫ్లాపా అనేది పక్కన పెడితే సినిమాలో దర్శకుడి యొక్క ప్రతిభ కనబడుతుంది. సుధీర్ లోని మరో కోణాన్ని ఆవిష్కరించాడు శ్రీరాం ఆదిత్య. అయితే సినిమా అనుకున్న పాయింట్ ని తెర మీద ఎక్కించే ప్రయత్నంలో కొద్దిగా పట్టు తప్పినా దర్శకత్వం పరంగా కుర్రాడు కొత్తవాడైనా కుమ్మేశాడు అని అనుకుంటున్నారు ప్రేక్షకులు.
భలే మంచి రోజు ముఖ్యంగా ఏ క్లాస్ ఆడియెన్స్ అదేనండి మల్టీ ప్లెస్ వారికి బాగా నచ్చే అవకాశం ఉంది. సినిమా క్రైం కామెడీ జానరే అయినా సినిమాను తెరకెక్కించే విధానంలో మంచి మార్కులు కొట్టేశాడు దర్శకుడు శ్రీరాం ఆదిత్య. సుధీర్ బాబుకి మంచి సినిమా అందించడంలో కూడా సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా సుధీర్ కు, దర్శకుడు శ్రీరాం ఆదిత్యకు నిజంగానే భలే మంచి రోజులు తెచ్చిపెట్టాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.