హైదరాబాద్: ఎలాగైనా పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్‌కు లక్ కాస్త ఎక్కువే. అతి తక్కువ కాలంలోనే టాప్ రేంజ్‌లోకి వెళ్ళిపోయింది. పెద్ద హీరోల ప్రాజెక్టులు చేజిక్కించుకుంది. ఇప్పుడు తాజాగా ఆమె ఒక జ్యూవలరీ షాప్‌తో ఆమె కుదుర్చుకున్న డీల్ చూసి టాలీవుడ్లో అందరికీ కళ్ళు తిరుగుతున్నాయట. విశాఖ పట్నానికి చెందిన ఆ షాప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నందుకు అక్షరాలా కోటిన్నర రూపాయలు ఇస్తున్నారట. ఇంతకూ ఈ బ్రాండ్ అంబాసిడర్ కొలువుకు ఈమె చేయాల్సింది ఏమిటీ అంటే… ఒకే ఒక్కరోజు షూటింగ్ అంట. ఆ రోజు తీసిన ఫోటోలు, వీడియోలనే సంవత్సరమున్నర పాటు ఆ జ్యూవలరీ షాప్ వారు వాడుకుంటారన్నమాట. టాలీవుడ్లో ఒక యాడ్ కోసం హీరోయిన్‌కు ఇంత పెద్ద మొత్తం ఇవ్వటం ఇదే ప్రథమం అంటున్నారు. అసలు మామూలుగా ఒక సినిమాకు ఆమె తీసుకునే మొత్తమే కోటి రూపాయలు కాగా, ఒక్క రోజు షూటింగుకు కోటిన్నర అంటే మాటలా మరి. అన్నట్లు ప్రస్తుతం రకుల్ జూనియర్ ఎన్టీఆర్‌తో ‘నాన్నకు ప్రేమతో’, అల్లు అర్జున్‌తో ‘సరైనోడు’ చిత్రాలను చేస్తోంది.