ఇన్నాళ్లూ.. చిరంజీవి 150 సినిమానే తెలుగు సినీ ప్రేక్షకులకు హాట్ టాపిక్. అయితే.. ఇప్పుడు అది కన్ఫాం అయిపోయింది. తమిళంలో హిట్ అయిన కత్తి సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని మెగాస్టార్ ఫిక్స్ అయిపోయారని తెలుస్తోంది. ఈ సినిమా డైరెక్టర్ గా వినాయక్ ని కూడా సెలక్ట్ చేసేశారు. అయితే.. ఆ తర్వాత కచ్చితంగా రీమేక్ కాకుండా డైరెక్ట్ తెలుగు స్టోరీతోనే సినిమా చేయాలనుకుంటున్నారట చిరంజీవి.
చిరంజీవి తర్వాత సినిమాని డైరెక్ట్ చేయడానికి చాలా మంది డైరెక్టర్లు ఉత్సాహంగా ఉన్నారు. అందుకు తగ్గ స్టోరీలు కూడా రెడీ చేసుకుంటున్నారు. కానీ.. వారందరిలో వెర్సటైల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఓ అడుగు ముందున్నట్టు కనిపిస్తోంది. చిరు 150 సినిమా కోసం కథ సిద్ధం చేశాడు పూరీ. అయితే.. అందులో సెకండాఫ్ మెగాస్టార్ కి పెద్దగా నచ్చకపోవడంతో అది వాయిదా పడింది. ఆ సెకండాఫ్ ని చిరుకి నచ్చేలా సిద్ధం చేసి.. డైరెక్షన్ చాన్స్ కొట్టాలని పూరీ ప్లాన్ చేస్తున్నారట. అందుకు వరుణ్ తేజ్ ని వాడుకుంటున్నాడు పూరి.
ఫటా ఫట్ సినిమా తీసేయడం, ధియేటర్లోకి తోసేయడం. హిట్ అయితే పార్టీ చేసుకోవడం. ఫట్ అయితే.. మళ్లీ తర్వాత సినిమా కోసం బ్యాంకాక్ ఫ్లైట్ టికెట్ తీసుకోవడం. ఇదే పూరీ స్టైల్. ఏదో రెండు మూడు ప్రెస్ మీట్ లు మినహా సినిమాకి సంబంధించి ప్రమోషన్ టూర్లు చేయడం పూరీ హిస్టరీలో లేదు. కానీ ఇప్పుడు లోఫర్ సినిమా కోసం రాష్ట్రంలోని ఆ మూల నుంచి ఈ మూల వరకు ధియేటర్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నాడు పూరి. మెగా ఫ్యామిలీ హీరో అయిన వరుణ్ ని తెగ పొగిడేస్తున్నాడు. ఇదంతా చిరు సినిమా కోసమేనా? చిరంజీవి, సాయి ధరమ్ తేజ్ మినహా మెగా క్యాంప్ లోని హీరోలందరినీ డైరెక్ట్ చేసిన పూరీ.. చిరుతో చాన్స్ కోసమే ఈ మెగా ప్రయత్నాలన్నీ చేస్తున్నాడని టాక్.