తెలుగు చిత్ర సీమలో ఈ ఏడాది బాహుబలి వంటి అంతర్జాతీయ స్థాయి గల ఒక గొప్ప సినిమా విడుదలవడం చాలా గొప్ప విషయమే. కానీ తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో అత్యంత దురదృష్టకరమయిన సంవత్సరంగా కూడా చెప్పవచ్చును. ఈ ఒకే ఒక సం.లో అనేకమంది అద్భుతమయిన నటీనటులను, సంగీత దర్శకులను కోల్పోయింది. ఈ ఏడాదిలో ఆహుతీ ప్రసాద్ (జనవరి 4), ప్రముఖ మాటల రచయిత గణేష్ పాత్రో (జనవరి 5), విబి. రాజేంద్ర ప్రసాద్ (జనవరి 12), ప్రముఖ హాస్య నటుడు ఎం.ఎస్. నారాయణ (జనవరి 23), ఎన్నో గొప్ప చిత్రాలు తీసిన నిర్మాత రామానాయుడు (ఫిబ్రవరి 18), కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి ( ఏప్రిల్ 18), మధుసూదన్ రెడ్డి (ఆడియో డిజైనర్) (ఏప్రిల్ 20) , ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వర రావు (ఏప్రిల్ 24), ఆర్తి అగర్వాల్ (జూన్ 6), ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎస్. విశ్వనాద్ (జూలై 14), కళ్ళు చిదంబరం (అక్టోబర్ 18), మాడా వెంకటేశ్వర రావు (అక్టోబర్ 24), ప్రశాంత్ (నవంబర్ 13), రంగనాద్ (డిశంబర్ 19), పొట్టి రాంబాబు (డిసంబర్ 28)న చనిపోయారు.