సినిమా సినిమాకీ నటుడిగా ఎదుగుతూ, ముందుకు దూసుకెళుతున్న ఆది ఇప్పటివరకూ చేసిన చిత్రాలన్నింటికన్నా చేసిన పూర్తి భిన్నమైన చిత్రం ‘గరం’. ఈ చిత్రకథ ఆదికి ఎంతగానో నచ్చి, తన తండ్రి సాయకుమార్ ని కన్విన్స్ చేసి, నిర్మించేలా చేశారు. మదన్ దర్శకత్వంలో శ్రీమతి వసంత శ్రీనివాస్ సమర్పణలో శ్రీనివాసాయి స్ర్కీన్స్ పతాకంపై పి.సురేఖ నిర్మించిన ఈ చిత్రంలో ఆది సరసన అదా శర్మ కథానాయికగా నటించింది. ‘పెళ్లైన కొత్తలో’ ఫేం అగస్త్య స్వరపరచిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభిస్తోంది. అలాగే, హీరో ప్రభాస్ విడుదల చేసిన టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. చిత్రవిజయం గ్యారంటీ అనే ఫీల్ ని టీజర్, పాటలు కలగజేశాయి.
ఈ సందర్భగా పి. సురేఖ మాట్లాడుతూ – ”కథ మీద నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మించాం. నటుడిగా ఆది కెరీర్ ని మరో మెట్టు ఎక్కించే విధంగా ఉంటుంది. లవ్, యాక్షన్, సెంటిమెంట్, కామెడీ.. ఇలా అన్ని అంశాలూ ఉన్న మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్ ఇది. మంచి మ్యూజికల్ హిట్ మూవీగా నిలుస్తుందనే నమ్మకం ఉంది. త్వరలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం” అని చెప్పారు.
మదన్ మాట్లాడుతూ – ”శ్రీనివాస్ గవిరెడ్డి మంచి కథ ఇచ్చారు. వాస్తవానికి నేను వేరే కథ ప్లాన్ చేసుకున్నాను. ఈ కథ నచ్చడంతో శ్రీనివాస్ దగ్గర అడిగాను. స్ర్కీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది. ఆదికి వంద శాతం నప్పే చిత్రం ఇది. ద్వేషించే వారిని ప్రేమించే స్థాయికి ఎదగడం చాలా కష్టం. ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకొని ఈ చిత్రం చేశాం. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ కథ ఆగకూడదనే పట్టుదలతో చివరికి హోమ్ బేనర్లో నిర్మించడానికి రెడీ అయిపోయారు. దీన్నిబట్టి ఆది ఈ కథను ఎంతగా ప్రేమించారో అర్థం చేసుకోవచ్చు. పాటల గురించి చెప్పాలంటే… మెలోడీ, మాస్.. ఇలా ఏ తరహా పాటలైనా ఆగస్త్య ఇవ్వగలుగుతాడు. ‘గరం’ చిత్రం కోసం ఆయన ఇచ్చిన పాటలకు ఎక్స్ ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంతో అగస్త్య టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరిగా నిలవడం ఖాయం” అని తెలిపారు.
ఈ చిత్రానికి కథ, మాటలు – శ్రీనివాస్ గవిరెడ్డి, కెమెరా – సురేందర్ రెడ్డి.టి, సంగీతం – ఆగస్త్య, కళ – నాగేంద్ర, ఎడిటింగ్ – కార్తీక్ శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత – బాబ్జీ, కో-డైరెక్టర్ – అనిల్, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం – మదన్.