సంవత్సరం మొత్తం ఏం సాధించాం అన్నది పక్కన పెడితే సంవత్సరం మొదలుని సంవత్సరపు ముగింపుని ఆస్వాధించడం మనిషి యొక్క నైజం. జీవితంలోని చీకటి రోజులను తరిమి కొడుతూ కొత్త సంవత్సరంలో కొత్త కాంతులతో విరజిల్లే ప్రయత్నం చేయడం కోసమే కొత్త సంవత్సరాన్ని నిత్య నూతనంగా జరుపుకుంటారు ప్రజలందరు. ఈ సంవత్సరం ఎలా గడిచింది ఏం జరిగింది అది మంచా చెడా అనే భావన వదిలి నూతన సంవత్సరం అయినా జీవితంలో కొత్త కాంతులను నింపాలని కోరుకుంటాం.
గడిచిన రోజులను గడిచిన సంవత్సరాన్ని మరచి నిత్య నూతనోత్సాహంతో ముందుకు సాగుదాం.. నవ చైతన్య భావనతో కలిసి అడుగులు వేద్దాం విజయం సాధించే వరకు పయనిద్దాం.. కష్టం మన ఆయుధం అయితే విజయం మన సొత్తు అవుతుంది. ఈ సంవత్సరం అందరికి కలిసి రావాలని కోరుకుంటూ తెలుగు360 రీడర్స్ కు ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు..