నూతన సంవత్సరం సందర్భంగా చాలా మంది కొత్త నిర్ణయాలు తీసుకొంటుంటారు. కానీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకదానికొకటి ఏమి చేయాలో తీర్మానం చేయడం విశేషం. నిన్న నొయిడాలో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడి మాట్లాడుతూ “గత ఆరు దశాబ్దాలుగా దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటుని స్తంభింపజేసి, దేశప్రగతిని అడ్డుకొనే హక్కు లేదు. కనుక నూతన సంవత్సరం సందర్భంగా ఇకపై పార్లమెంటుని స్తంభింపజేయబోమని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ప్రతిజ్ఞ చేయాలి,” అని సూచించారు.
అందుకు కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ బదులిస్తూ “పార్లమెంటులో ప్రతిష్టంభనకి ప్రభుత్వ అహంకారమే కారణం. దానిని విడిచిపెట్టగలిగితే పార్లమెంటు లోపల, బయటా మంచి వాతావరణం ఏర్పడి పార్లమెంటు సజావుగా సాగుతుంది. కనుక ఆ అహకారం విడిచిపెట్టేస్తామని ప్రధాని నరేంద్ర మోడి ఈ నూతన సంవత్సరం సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తే బాగుంటుంది,” అని అన్నారు.