రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘కిల్లింగ్ వీరప్పన్’. గంధపు చక్కల స్మగ్లర్ వీరప్పన్ ను చంపిన పోలీస్ అధికారి పాత్ర ఆధారంగా తీసిన ఈ సినిమా అసలైతే నిన్న విడుదల అవ్వాల్సి ఉంది. కాని సెన్సార్ దగ్గర కొన్ని టెక్నికల్ ప్రాబ్లెంస్ వల్ల సినిమా తెలుగులో విడుదల కాలేదు. అయితే సినిమా కన్నడలో మాత్రం విడుదల అయ్యింది.
విడుదలైన సినిమాకు అక్కడ మంచి టాక్ వచ్చిందని తెలుస్తుంది. తెలుగు వర్షన్ మాత్రం మరోసారి వాయిదా వేశాడు వర్మ. ఈరోజు సాయంత్రం కల్ల సెన్సార్ క్లియరెన్స్ కూడా వస్తుందట అందుకే సినిమాను జనవరి 7న విడుదల చేయడానికి సిద్ధమయ్యాడు సంచలన దర్శకుడు వర్మ.
కన్నడ సినిమా రిపోర్ట్ ప్రకారం వీరప్పన్ గా సందీప్ భరధ్వాజ్, పోలీస్ అధికారిగా నటించిన శివ రాజ్ కుమార్ అద్భుత నటన కనబరిచారట. సినిమా నూతన సంవత్సర కానుకగా వస్తే చూసేద్దాం అనుకున్న వర్మ అభిమానులకు నిరాశే కలిగింది. వీరప్పన్ గురించి ఎవరికి తెలియని నిజాలు ఇందులో ప్రస్థావించడం జరిగిందని వర్మ చెప్పడంతో సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. మరి జనవరి 7న విడుదలవుతున్న కిల్లింగ్ వీరప్పన్ సినిమా వర్మకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.