మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ కూడా మెగాగానే ఉండబోతోంది. అందుకు తగ్గ ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. రామ్ చరణ్ సొంత బ్యానర్ తో పాటు, లైకా ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణంలో చిరు చేయబోతున్న సినిమాకి భారీ పారితోషికం తీసుకోబోతున్నాడు. కత్తి సినిమా తెలుగు రీమేక్ లో నటిస్తున్న చిరంజీవికి రెమ్యునరేషన్ కింద 30 కోట్లు ముచ్చజెప్పబోతున్నారట. అందుకు నిర్మాతలు సిద్ధమయ్యారట.
చిరంజీవి పారితోషికమే భారీగా ఉంటే.. ఇక సినిమా ఇంకెంత భారీగా ఉండబోతోంది. అయినా.. రామ్ చరణ్ రచ్చ సినిమాకే దాదాపు 60 కోట్లు ఖర్చుపెట్టారు. మరి చిరంజీవి సినిమాకి అంతకంటే కనీసం ఓ 10కోట్లు తక్కువ కాకుండా చూసుకోవడం ఖాయం. అంటే.. చిరు రెమ్యూనరేషన్ 30 కోట్లు ప్లస్ మిగతా అన్నీ కలిపి దాదాపు సెంచరీ కొట్టేయడం ఖాయంగా కనిపిస్తోంది.
100 కోట్లు కంటే లెక్క ఎక్కువైనా ఫరవాలేదు. తక్కువ కాకుండా చూసుకోవడానికి రామ్ చరణ్ అండ్ టీమ్ సిద్ధంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా మెగాస్టార్ కు ఉన్న ఫాలోయింగ్, ఆయన 150 సినిమా మీద ఉన్న అంచనాలు, పెట్టిన పెట్టుబడికి డబుల్ కి డబుల్ వసూల్ చేయగలిగిన సత్తా అన్నీచిరంజీవి సొంతం కాబట్టి ఎంతైనా సై అంటున్నారు నిర్మాతలు.