దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇది ఈనాటి సామెత కాదు. అప్పుడెప్పుడో పుట్టింది. అయితే దాన్ని బాగా వంటబట్టించుకుంటోంది కుమారి. అదే కుమారి 21 ఎఫ్ హీరోయిన్ హేబా పటేల్. కుమారి సినిమాతో.. ఈ కుమారికి మంచి క్రేజ్ వచ్చింది. మొదటి సినిమా ‘అలా ఎలా’ కంటే కూడా ఈ సినిమాతో యువతలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.
అమ్మడికి ఉన్న ఫాలోయింగ్ ను చూసి నిర్మాతలు కూడా సూట్ కేసులు పట్టుకుని ఫాలో అవుతన్నారట. దీంతో సడన్ గా రెమ్యూనరేషన్ పెంచేసింది హెబా. అరకోటి ఇస్తేనే.. అగ్రిమెంట్ మీద సంతకాలు పెడతానంటోందట. మరో మాట ఏదైనా ఉందా అంటే మళ్లీ రండి.. అప్పుడు మాట్లాడుకుందాం అనేంతగా చూస్తోందట. మరి అమ్మడి క్రేజ్ చూస్తుంటే కుమారి లాంటి మరో హిట్ పడితే మరో 50 కూడా పెంచి కో..కో కోటి అన్నా అనేస్తుంది అంటున్నారు విశ్లేషకులు.
ఏది ఏమైనా పరిశ్రమలో ఒకసారి క్రేజ్ వచ్చిందంటే ఇక వారిని మాటలతో కాదు పారితోశికంతోనే గెలవాలని మరోసారి రుజువుచేసింది కుమారి. ప్రస్తుతం అమ్మడి చేతిలో దాదాపు నాలుగు సినిమాల దాకా ఉండటం విశేషం. తన గాడ్ ఫాదర్ సుకుమార్ కూడా మరో సినిమాకు హెబ్బా పటేల్ ని తీసుకున్నాడని తెలిసిందే కదా..