హైదరాబాద్: త్వరలో జరగబోతున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఎన్టీవీ నీల్సన్ సంస్థతో కలిసి నిర్వహించిన సర్వే ఫలితాలను నిన్న వెలువరించింది. మొత్తం 150 డివిజన్ స్థానాలకు గానూ టీఆర్ఎస్ పార్టీ 75 నుంచి 85 స్థానాలు దక్కించుకుంటుందని పేర్కొంది. టీడీపీ-బీజేపీ కూటమికి కేవలం 25 నుంచి 35 స్థానాలు మాత్రమే లభిస్తాయని చెప్పింది. ఎంఐఎం పార్టీ 40 నుంచి 45 స్థానాలు వస్తాయని పేర్కొంది. హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని, ఆ పార్టీకి కేవలం 12 లోపు మాత్రమే స్థానాలు లభిస్తాయని చెప్పింది. ఇతరులకు 3 స్థానాలు లభిస్తాయని పేర్కొంది.
సీమాంధ్ర వాసులు గణనీయంగా ఉండే హైదరాబాద్ నగరంలో టీఆర్ఎస్ పార్టీకి గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద విజయాలేమీ లభించని సంగతి తెలిసిందే. అలాంటిది ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ బల్దియా పీఠాన్ని కైవసం చేసుకుందని ఎన్టీవీ సర్వే చెప్పటం సంచలనం రేకెత్తిస్తోంది. ఈ నెల మూడోవారం జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి.