హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తోన్న ఐసిస్ టెర్రరిస్టులకు ఒకే ఒక్క దేశమంటే మాత్రం వణుకు, దడ అని తెలిసింది. అది ఇజ్రాయెల్ దేశం. ఐసిస్ ప్రభావిత ప్రాంతంలో ప్రవేశించి బతికి బయటపడ్డ మొట్టమొదటి విలేకరి, జర్మన్ దేశవాసి జుర్గెన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఐసిస్ ఉగ్రవాదులకు ఇజ్రాయెల్ అంటే చాలా భయమని చెప్పారు. అందుకే మిడిల్ ఈస్ట్ దేశాల్లో తొలిదశ వలస పాలన ఏర్పాటు చేసే దేశాలలో ఇజ్రాయెల్‌ను చేర్చలేదని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ఆర్మీ చాలా బలమైనదని ఐసిస్ ఉగ్రవాదులు తనతో చెప్పారని తెలిపారు. అమెరికన్, బ్రిటన్ ఆర్మీలపై ఐసిస్ ఉగ్రవాదులకు చాలా తేలిక అభిప్రాయం ఉందని చెప్పారు. ఆ ఆర్మీలకు ఉగ్రవాదులను ఎలా ఎదుర్కోవాలో తెలియదని ఐసిస్ వారు అన్నట్లు విలేకరి తెలిపారు. ఆ దేశాల సైన్యాన్ని ఓడించగలమనే నమ్మకం ఐసిస్‌లో ఉందని చెప్పారు. గెరిల్లాలతోను, ఉగ్రవాదులతోను పోరాడటంలో ఇజ్రాయెలీ సైనికులు కఠినంగా వ్యవహరిస్తారని ఐసిస్‌కు తెలుసని జర్మన్ విలేకరి అన్నారు.