ఔను. తెలుగు సినిమా పరిశ్రమలో.. శ్రమకోర్చి.. ఎన్నో హిట్ చిత్రాలు తీసిన బడా నిర్మాతలు ఈ మధ్య ఎక్కడా కనిపించడం లేదు. ఇండస్ట్రీ హిట్ లు ఇచ్చిన వారు కూడా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.
వైజయంతి మూవీస్ బేనర్ మీద ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించిన మెగా ప్రొడ్యూసర్ సి. అశ్వినీదత్.. ఈ మధ్యకాలంలో మరీ నల్లపూసైపోయారు. ఏవో టీవీ ప్రోగ్రామ్స్ లో అక్కడక్కడ కనిపిచండం మినహా.. ప్రొడ్యూసర్ గా ఎక్కడా పోస్టర్ కనిపించడం లేదు.
మొన్నటి వరకు భారీ చిత్రాల నిర్మాతగా అన్ని ఆడియో ఫంక్షన్లలో మొదటి వరుసలో కనిపించారు బండ్ల గణేశ్. అసలు ఈ మధ్యకాలంలో ఏ ఆడియో ఫంక్షన్ లోనూ ఆయన ఆడియో వినిపిచడం లేదు. కనీసం మనిషి కూడా కనిపించడం లేదు. మొన్నామధ్య కోళ్లఫారంలో కోడిగుడ్లు ఏరుతున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హడావిడి చేసింది. ఖాళీ టైమ్ లో పవన్ కల్యాణ్ వ్యవసాయం చేసినట్టు బండ్ల గణేశ్ కూడా కోళ్లఫారంలో కాసేపు సేదతీరుతున్నారా? లేకపోతే మరేదైనా విషయం ఉందా అనేది తేలాలి.
ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన కేఎస్ రామారావు, శ్రీరామ రాజ్యం, ఇంటింటా అన్నమయ్య లాంటి భారీ చిత్రాలు తీసిన నిర్మాత యలమంచిలి సాయిబాబా కూడా ఎక్కడా కనిపించడం లేదు. ఈబ్యానర్లలో సినిమాలు కూడా రావడం లేదు. వీళ్లే కాదు. ఇంకా కొందరు నిర్మాతలు కూడా తెరమరుగైపోతున్నారు. ప్రతి శుక్రవారానికి జాతకాలు మారిపోయే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి పెద్ద ప్రొడ్యూసర్లు కనిపించడం, తెరమరుగైపోవడం ఆశ్చర్యంగా ఉన్నా పరిశ్రమలో ఇదంతా కామనే అంటారు సినీ జనం.