రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి సూపర్ హిట్స్ తరువాత యంగ్ ఎనర్జిటిక్ స్టార్ శర్వానంద్ హీరోగా, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ బంపర్ హిట్ తరువాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో, సురభి కథనాయికగా, మిర్చి, రన్ రాజా రన్, జిల్, భలే భలే మగాడివోయ్ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాల తరువాత క్లీన్ ఎంటర్ టైనర్స్ ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఎక్స్ ప్రెస్ రాజా సెన్సారు కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. చిత్రాన్ని చూసిన సెన్సారు సభ్యులు చిత్రంలో వచ్చే థ్రిల్స్ ని ఎంజాయ్ చేస్తూ చూడటం విశేషం. పక్కా ఎంటర్టైన్మెంట్ చిత్రం గా సెన్సారు సభ్యులు కితాబుని అందించారు. ఈ చిత్రానికి కి క్లీన్ యు సర్టిఫికెట్ ని ఇచ్చారు. ఇప్పటికే ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించిన పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జనవరి 14న సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ” మా బ్యానర్ లో శర్వానంద్ మా కాంబినేషన్ లొ వచ్చిన సూపర్‌హిట్ రన్‌రాజారన్ చిత్రం తరువాత మా కాంబినేషన్ లో వస్తున్న ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రానికి సంభంధించిన సెన్సారు కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. చూసిన సెన్సారు సభ్యుల ప్రశంశలు పోందటమే కాకుండా వారు థ్రిల్ అయ్యామని చెప్పటం ఆనందంగా వుంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ తరువాత దర్శకుడు మేర్లపాక గాంధి ఈచిత్రానికి చేశారు. మరోసారి హిలేరియస్ ఎంటర్ టైనర్ అందించారు. హీరోయిన్ సురభి, శర్వానంద్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం. మా బ్యానర్ నుంచి వచ్చిన నాలుగు చిత్రాల్ని ఏవిధంగా ఘనవిజయం చేశారో ఈ ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాన్ని కూడా వాటిని మించి విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాము.” అని అన్నారు.
శర్వానంద్, సురభి, ఊర్వ హరీష్ ఉత్తమన్, పోసాని కృష్ణ మురళి సూర్య నాగినీడు బ్రహ్మాజి, సుప్రీత్, సప్తగిరి, ప్రభాస్ ను, షకలకశంకర్, ధనరాజ్ తదితరులు నటించగా..
ఈ చిత్రానికి
మ్యూజిక్ – ప్రవీణ్ లక్కరాజు
సినిమాటోగ్రఫి – కార్తిక్ గట్టమనేని
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – సందీప్. ఎన్
ఎడిటర్ – సత్య.జి
ప్రొడక్షన్ డిజైనర్ – ఎస్.రవిందర్
లిరిక్స్ – భాస్కరభట్ల, శ్రీమణి, శ్రీ జో
డ్యాన్స్ – రాజు సుందరం, విశ్వ, రఘు
చీఫ్ కాస్ట్యూమ్ డిజైనర్ – తోట విజయ్ భాస్కర్
ఫైట్స్ – స్టంట్ జాషువా
ప్రొడక్షన్ కంట్రోలర్స్ – ఎమ్. కృష్ణం రాజు (గోపి), మత్తపాటి షణ్ముఖ రావ్
పి.ఆర్.ఓ – ఎస్.కె.ఎన్, ఏలూరు శ్రీను
పబ్లిసిటీ డిజైనర్ – వర్కింగ్ టైటిల్ (శివ కిరణ్)
నిర్మాతలు – వంశీ, ప్రమోద్
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ – మేర్లపాక గాంధి