కొత్త ఏడాదిలో టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాటిలో ఒకటి రెమ్యునరేషన్. 2015లో హిట్ అయిన వారు, 2016లో చేయబోయే సినిమాలకు తీసుకునే పారితోషికాన్ని అమాంతం పెంచేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు 2కోట్లు తీసుకునే హీరో.. ఏడాది చివర్లో బ్లాక్ బస్టర్ హిట్ పడగానే.. దాన్ని డబుల్ చేసేశాడట.
ఇక పెద్ద పెద్ద హీరోల సంగతి కూడా అలాగే ఉంది. రెమ్యునరేషన్ విషయంలో మార్పులు చేస్తున్నారు. మార్కెట్ లో తమ డిమాండ్ కంటే కూసింత ఎక్కువే వెనకేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక హీరోయిన్లు కూడా అదే బాట పడుతున్నారు. సినిమాల్లోనే కాదు. ప్రకటనల్లో నటించడానికి కూడా భారీ మొత్తాలే అడుగుతున్నారట. ఈ మధ్య కాలంలో ఏమాత్రం హిట్లు లేని ఓ హీరోయిన్ ని యాడ్ కోసం అడిగితే.. కోటి రూపాయలు అడిగిందట. అయితే అంత ఇచ్చుకోలేమని చెప్పి వేరే హీరోయిన్ వేటలో పడ్డారు సదరు యాడ్ ఏజెన్సీ వారు.
ఏదేమైనా కొత్త ఏడాదిలో కొత్త నిర్ణయాలు అంటే ఏమైనా నటన పరంగా మెళకువలు తెలుసుకోవాలనుకుంటారు. కానీ మనోళ్లు మాత్రం చాలా ఫాస్ట్ గా ఉన్నారు. వీటన్నటికంటే ముఖ్యంగా సాధ్యమైనంత వరకు డబ్బులు దండుకుందామనే ఆలోచనలో ఉన్నారు నేటి హీరో హీరోయిన్లు.