బడా నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తనయుడిని హీరోగా గ్రాండ్ గా ఎంట్రీ ఇప్పించాడు. అల్లుడు శీను అంటూ వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన శ్రీను కమర్షియల్ గా సక్సెస్ అవ్వకపోయినా కుర్రాడు స్పీడ్ చూసి అందరు మెచ్చుకున్నారు. అయితే మొదట సినిమాలోనే సమంత, తమన్నా లాంటి క్రేజీ హీరోయిన్స్ తో రొమాన్స్ చేసిన శ్రీనివాస్. తన మూడో సినిమాగా వస్తున్న బోయపాటి శ్రీను సినిమాలో రకుల్ ని సెలెక్ట్ చేశాడట.
బెల్లంకొండ శ్రీను సలహా మేరకే రకుల్ ని భారీ పారితోషికం ఇచ్చి మరి ఆ సినిమాలో తీసుకున్నారని తెలుస్తుంది. మొదటి సినిమాలో సమంత కెరియర్ మొదలైనప్పటి నుండి అల్లుడు శీనులో కనిపించినంత హాట్ గా చూపించి అలరించేలా చేశారు. భారీ పారితోషికం ఆశ చూపి అమ్మడి అందాలన్నిటిని ప్రేక్షకుల ముందు ఆవిక్షరించేలా చేశాడు నిర్మాత బెల్లంకొండ సురేష్.
ఇప్పుడు ఆ క్రమంలోనే మంచి ఫాంలో ఉన్న రకుల్ ని కూడా శ్రీనివాస్ సినిమాకు ఓకే చేయించాడు. ఈ సినిమాకు గాను అమ్మడు కోటిన్నర నుండి రెండు కోట్ల దాకా పారితోషికం డిమాండ్ చేస్తుందని సమాచారం. ఆమె క్రేజ్ దృష్ట్యా అడిగినంత ఇచ్చి మరి హీరోయిన్ గా ఓకే చేయించుకున్నాడట. మరి రాబోయే ఈ సినిమాలో కూడా రకుల్ అందాల కనువిందు జరుగనున్నదని చెప్పొచ్చు. క్రేజీ హీరోయిన్స్ తో సినిమాలు తీస్తున్న బెల్లంకొండ శ్రీను ఈ సినిమాతోనైనా కమర్షియల్ గా సక్సెస్ కొడతాడో లేదో చూడాలి.