హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఈ మధ్య ఎక్కడ సభలో పాల్గొన్నా ఒక మాటమాత్రం తప్పనిసరిగా చెబుతున్నారు. ఆ మాటను విన్నవారికి విసుగొస్తోంది తప్ప ఆమెకు విసుగు రావటం లేదు. తన తండ్రి కేసీఆర్ భోళా శంకరుడని, అడిగిన వారికి అడిగినట్లు వరాలిస్తున్నారని కవిత చెప్పుకొస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారాన్ని మొన్న ప్రారంభిస్తూ, ఖైరతాబాద్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారసభలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బోళా శంకరుడు అని, కేసీఆర్తో ఒక్కసారి సోపతి చేస్తే ఆయన ఎలా చూసుకుంటారో తెలుస్తుందని, అందుకే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక్కసారి కారు గుర్తుకు ఓటు వేసి చూడాలని చెప్పారు. బోళా శంకరుడిలా వరాలు ఇచ్చేస్తున్నాడన్న కవిత వ్యాఖ్యలు చూస్తుంటే, కేసీఆర్ తనను పొగిడినవాళ్ళందరికీ ముందూ వెనక చూసుకోకుండా అన్నీ ఇచ్చే అమాయకుడు అన్నట్లు అనిపిస్తోంది. కవితక్క మొత్తానికి తండ్రికే పాఠాలు చెప్పేటట్లుగా ఉన్నారు. అయినా ఇచ్చే ఆయనకు, తీసుకునే ప్రజలకు లేని బాధ నీకు ఎందుకు కవితక్కా!