ప్రజారాజ్యం వైఫల్యం తర్వాత మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్‌కు ఆశాకిరణంగా మారిన పార్టీ జనసేన. అది రాజకీయ పార్టీగా రిజిస్టర్ అవ్వడంతో భవిష్యత్తుపైన చాలా ఆశలే పెట్టుకుంది ఫ్యాన్స్. తెలుగు ప్రజల శ్రేయస్సే ధ్యేయమని పదేపదే చెప్తున్న పవన్‌కళ్యాణ్‌ను జనం కోసం ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని చాలా కాలంగా అభిమానులు, కార్యకర్తలు కోరుతూనే ఉన్నారు. అయితే దానికి సంబంధించి జనసేన చీఫ్ ఇప్పటి వరకూ పెదవి విప్పలేదు. గత ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కూటమికి సంపూర్ణ మద్దతు ప్రకటించి ప్రచారం కూడా చేసిన పవన్, పోటీకి దిగకపోయినా రాజకీయాలపై తనదైన మార్క్ వేయగలిగారు..
సార్వత్రిక ఎన్నికల తర్వాత అంశాల ప్రాతిపదికన స్పందిస్తూ వస్తున్న పవన్‌కళ్యాణ్ , ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీపై మాత్రం నోరు విప్పడం లేదు . అయితే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేద్దామని ఆయన అభిమానులు అర్జీల మీద అర్జీలు పెట్టుకుంటున్నారంట ఆయనకి . ఆ క్రమంలో ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు దగ్గరపడ్డాయి. అటు చూస్తే తెలంగాణలో రాజకీయపార్టీగా జనసేన నమోదు అయిఉంది . దాంతో గ్రేటర్ ఎన్నికల బరిలో జనసేన క్యాండెట్లు ఉంటారని భావించారు . మొత్తం డివిజన్లలో కాకపోయినా . పవన్‌కళ్యాన్ పవర్ చూపించగలిగే డివిజన్లలో అయినా జనసేన పోటీ చేస్తుందనుకున్నారు.
అయితే మారిన పరిస్థితుల్లో బల్దియా బ్యాటిల్‌కు జనసేన దూరంగానే ఉండబోతోంది. జనరల్ ఎలక్షన్స్‌కు ముందు పార్టీని స్థాపించిన పవర్‌స్టార్…టిడిపి, బిజెపికి మద్దతుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం చేసి అభిమానుల్లో కొత్త ఊపు తీసుకొచ్చారు. ఆ క్రమంలో టిఆర్ఎస్ను ఒక రేంజ్లో టార్గెట్ చేశారు. తర్వాత ఏపి రాజధాని భూసమీకరణ వంటి వివిధ అంశాలకు సంబంధించి మీడియా ముందుకు వచ్చారు కాని పొలిటికల్ డెసిషన్స్ ఏవీ ప్రకటించలేదు. అయితే 2014 ఎన్నికల నాటి పరిస్థితి ఇప్పుడు లేదు . దాంతో జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీకి జనసేన దూరంగా ఉండబోతోంది. పవన్ పార్టీ పోటీకి దూరంగా ఉన్నప్పటికీ ఆయన్ని కనీసం ప్రచారబరిలోకి దించాలని భావిస్తున్నాయి టిడిపి, బిజెపిలు. పాత స్నేహాన్ని కొనసాగిస్తూ గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం చేయాలని పవన్కళ్యాన్ని కోరుతున్నారంట కూటమి నేతలు . దాంతో పవన్ ప్రచారం చేస్తారా? లేదా? అన్న చర్చ జోరుగా సాగుతోంది పొలిటికల్ సర్కిల్స్‌లో … ఆ క్రమంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో పవర్‌స్టార్ గ్రేటర్ ఎలక్షన్స్‌ని టచ్ చేయరన్న టాక్ గట్టిగానే వినిపిస్తోంది.