తెలుగు సినిమాకి కొత్త టేకింగ్‌ని పరిచయం చేసిన రామ్‌గోపాల్‌వర్మకి ఒక సీన్‌ని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఎలా ఎలివేట్ చెయ్యొచ్చు, కేవలం సౌండింగ్‌తో ఆడియన్స్‌ని ఎలా థ్రిల్ చెయ్యొచ్చు అనే విషయాలు క్షుణ్ణంగా తెలుసు. శివ చిత్రంతో స్టార్ట్ అయిన అతని కెరీర్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు వున్నాయి. సెన్సేషనల్ డైరెక్టర్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వర్మ కొన్ని నాసిరకం సినిమాలతో ఇతనా తెలుగు సినిమా ట్రెండ్‌ని మార్చింది అని ఆశ్చర్యపోయేలా చేశాయి. ఒకప్పుడు ముంబై నుంచి రామ్‌గోపాల్‌వర్మ హైదరాబాద్ వస్తున్నాడంటే మామూలు హడావిడి వుండేది కాదు. కానీ, ఇప్పుడు ఒక సినిమా ఫంక్షన్‌కి వర్మ వస్తున్నాడంటే ఇది మామూలే అనుకునేట్టు చేశాయి అతని లేటెస్ట్ సినిమాలు. అతను ఈమధ్య తీసిన సినిమాలు అతనికి గుణపాఠం చెప్పాయో లేక తన మునుపటి వైభవం గుర్తొచ్చిందో తెలీదు కానీ ‘కిల్లింగ్ వీరప్పన్’ అనే ఓ సెన్సేషనల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రామ్‌గోపాల్‌వర్మ. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ పోలీస్ ఆఫీసర్‌గా, సందీప్ భరద్వాజ్ వీరప్పన్‌గా నటించిన ఈ చిత్రాన్ని తను విన్న విషయాలు, రీసెర్చ్ చేసి తెలుసుకున్న నిజాలతో తెరకెక్కించాడు వర్మ. జనవరి 1న కన్నడలో విడుదలైన ఈ చిత్రం అక్కడ విజయం సాధించింది. జనవరి 7న ‘కిల్లింగ్ వీరప్పన్’ తెలుగు వెర్షన్ విడుదలైంది. మరి తెలుగు ప్రేక్షకుల్ని ఈ చిత్రం ఎంతవరకు ఆకట్టుకుంది? మరోసారి వర్మ తన టేకింగ్‌తో విజృంభించాడా? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
కథ:
ఇది వీరప్పన్ జీవిత చరిత్ర కాదు. వీరప్పన్ జీవితంలో జరిగిన ముఖ్యమైన ఘట్టాలతో రూపొందించిన సినిమా అసలే కాదు. 20 ఏళ్ళపాటు కర్ణాటక, తమిళనాడు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన వీరప్పన్ని ‘ఆపరేషన్ కొకూన్’ ద్వారా ఎలా హతమార్చారు? దాని కోసం పోలీసులు ఎలాంటి వ్యూహాలు పన్నారు? వీరప్పన్ని చట్టానికి వ్యతిరేకంగా హత్య చేశారని అతని భార్య ముత్తులక్ష్మీ చేసిన ఆరోపణల్లో ఎంతవరకు నిజం వుంది? అనేది ఈ చిత్రంలో ప్రస్తావించడం జరిగింది.వీరప్పన్ ని తుది ముట్టించడానికి ఎన్నో ఆపరేషన్లు జరుగుతాయి. అవేవి సఫలమవ్వని నేపధ్యంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీంతో కలిసి ఓ ప్రణాళిక రచించి రంగంలోకి దిగుతాడు కన్నన్. ఈ ఆపరేషన్ చేపట్టిన కొద్ది రోజుల్లోనే వీరప్పన్ అడవుల్లో ఉండగా చంపడం అసంభవం అనే విషయాన్ని తెలుసుకుంటాడు. దాంతో ఎలాగైనా అడవి నుంచి బయటికి రప్పించడానికి ప్రయత్నాలు చేస్తాడు. కోవర్ట్ ఆపరేషన్ ద్వారా ట్రై చేస్తాడు. అది విఫలమవ్వడంతో వీరప్పన్ భార్య ముత్తులక్ష్మీ ద్వారా వీరప్పన్ ని బయటికి రప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ కన్నన్ వేసే ప్లాన్స్ ని పసిగట్టిన వీరప్పన్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ఉంటాడు. ఫైనల్ గా కన్నన్ ఈ ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా ఎలా పూర్తి చేసాడు.. చివరికి ‘ఆపరేషన్ కొకూన్’లో వీరప్పన్ని హతమార్చడం జరుగుతుందో వివరంగా చూపించడమే ఈ చిత్ర కథ.
నటీనటుల పెర్ఫార్మెన్స్:
ఎస్.టి.ఎఫ్ ఆఫీసర్‌గా శివరాజ్‌కుమార్ అద్భుతమైన నటనని ప్రదర్శించాడు. నిజంగానే శివరాజ్‌కుమార్ పోలీస్ ఆఫీసరా అనిపించేలా అతను పెర్ఫార్మ్ చేశాడు. కన్నడ స్టార్ రాజ్‌కుమార్‌ని వీరప్పన్ కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వీరప్పన్ పేరుతో రూపొందిన ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్ పెర్ఫార్మెన్స్ టెర్రిఫిక్‌గా అనిపిస్తుంది. ఇక వీరప్పన్ పాత్రను పోషించిన సందీప్ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతని పర్సనాలిటీగానీ, ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్‌గానీ, బాడీ లాంగ్వేజ్‌గానీ వీరప్పన్లాగే అనిపిస్తాయి. చాలా సీన్స్‌లో భరద్వాజ్ పెర్ఫార్మెన్స్ ఒళ్ళు గగుర్పొడిచేలా వుంటుంది. వీరప్పన్ భార్యగా నటించిన యజ్ఞశెట్టి, పోలీస్ ఇన్ఫార్మర్గా నటించిన పరుల్ యాదవ్ వాళ్ళిద్దరూ కలిసి చేసిన సీన్స్‌ని పండించారు. అలాగే మిగతా పాత్రలు పోషించిన నటీనటులు కూడా తమ తమ క్యారెక్టర్లను చాలా నేచురల్‌గా పెర్ఫార్మ్ చేశారు.
టెక్నికల్ డిపార్ట్మెంట్:
తన మొదటి చిత్రం ‘శివ’ నుంచి ‘కిల్లింగ్ వీరప్పన్’ వరకు ప్రతి చిత్రంలోనూ టేకింగ్ పరంగా స్పెషాలిటీ చూపిస్తూ వస్తున్న రామ్‌గోపాల్‌వర్మ ఈ చిత్రంలోనూ తన మార్క్‌ని చూపించాడు. దానికి వర్మ వాడే ఆయుధాలు మూడు. ఒకటి కెమెరా, రెండు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, మూడు సౌండ్స్. ఈ మూడు ఆయుధాలతో ఎన్నో సెన్సేషనల్ మూవీస్‌ని తీసిన వర్మకు ‘కిల్లింగ్ వీరప్పన్’ చిత్రంలో ఈ ఆయుధాల అవసరం ఎంతగానే ఏర్పడింది. తన ప్రతి సినిమాలోలాగే ఈ సినిమాలో కూడా కెమెరాతో అష్ట వంకరలు తిప్పడం, పరిగెత్తించడం వంటి విన్యాసాలు చేయించాడు. అయితే కొన్ని సీన్స్‌లో ఆడియన్స్‌ని థ్రిల్ చేసిన కెమెరా మరికొన్ని సీన్స్‌లో ఆడియన్స్‌కి తలనొప్పిగా మారింది. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే చాలా సీన్స్‌ని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎలివేట్ చేసింది. సినిమా మొదటి నుంచి చివరి వరకూ ‘టక్కుం టిక్కుం….’ అంటూ సాగే బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ సీన్స్‌కి బాగా ఉపయోగపడింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని సీన్స్‌లో స్థాయిని మించి వుండడంతో అది కూడా ఆడియన్స్ తలనొప్పికి కారణమైంది. ఇక సౌండ్స్ మాత్రం సీన్స్‌కి తగ్గట్టుగానే వున్నాయి. వర్మ గురించి చెప్పుకోవాల్సి వస్తే 20 ఏళ్ళు పోలీసుల్ని గడగడలాడించిన వీరప్పన్ గొప్పతనాన్ని, తెలివి తేటల్ని, చాకచక్యాన్ని చూపించడంలో అతను విఫలమయ్యాడని చెప్పాలి. సినిమాలో ఎక్కువ భాగం పోలీసులకు సంబంధించిన సీన్సే వుంటాయి. వీరప్పన్ కేవలం ఎవరిని కిడ్నాప్ చెయ్యాలి, ఎలా డబ్బులు సంపాదించాలి, ఎల్‌టిటిఇ ప్రభాకరన్‌ని ఎలా కలవాలి అనే ఆలోచనతోనే వున్నట్టు చూపించాడు వర్మ. వీరప్పన్ని చంపడానికి పోలీసులు చేపట్టిన ఆపరేషన్ కావడం వల్ల అతన్ని ఎక్కువ ఎలివేట్ చేసే అవకాశం లేదని మనం సర్ది చెప్పుకోవాలి. ఈ సినిమాకి సంబంధించి వర్మ తీసుకున్న ఓ తెలివైన నిర్ణయం వీరప్పన్ పాత్ర కోసం సందీప్ భరద్వాజ్‌ని సెలెక్ట్ చేసుకోవడం. వీరప్పన్ని మళ్ళీ చూస్తున్నామా అనేలా సందీప్ గెటప్ వుంటుంది. అయితే అతన్ని అచ్చు వీరప్పన్లా క్రియేట్ చేసిన క్రెడిట్ మాత్రం వర్మకే చెందుతుంది. ఎందుకంటే విడిగా సందీప్‌ని చూసిన వారెవరూ అతనే వీరప్పన్‌గా నటించాడని చెప్తే తప్ప తెలుసుకోలేని విధంగా వుంటాడు.
విశ్లేషణ:
ఈ సినిమాలో కొన్ని ప్లస్‌లు, కొన్ని మైనస్‌లు వున్నప్పటికీ ఈ సినిమా టేకింగ్ చూసిన తర్వాత రామ్‌గోపాల్‌వర్మ ఈజ్ బ్యాక్ అని మాత్రం చెప్పక తప్పదు. వీరప్పన్‌కి సంబంధించిన కొన్ని సీన్స్‌తో సినిమాలో అతని ఎంట్రీ జరుగుతుంది. ఇక అతన్ని ఎలా పట్టుకోవాలి, ఎలా మట్టు పెట్టాలి అని స్పెషల్ టాస్క్ ఫోర్స్ వేసే ఎత్తులతో, వీరప్పన్ భార్య ముత్తులక్ష్మీతో పోలీస్ ఇన్ఫార్మర్ శ్రేయ చేసే స్నేహం తాలూకు కొన్ని సీన్స్ తర్వాత వీరప్పన్ని ముత్తులక్ష్మీ దగ్గరకు రప్పించి చంపాలన్న పోలీసుల ప్రయత్నం విఫలం కావడంతో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. వీరప్పన్ని పట్టుకోవడానికి రకరకాల వ్యూహాలతో ముందుకెళ్ళే ఎస్.టి.ఎఫ్.ని ప్రతిసారీ వీరప్పన్ అడ్డుకోవడంతో ఒక పక్కా ప్లాన్‌తో వీరప్పన్ని అడవి నుంచి బయటికి రప్పిస్తాడు. ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం ఒక స్పాట్లో చుట్టిముట్టి అతన్ని చంపుతుంది ఎస్.టి.ఎఫ్. ఫస్ట్‌హాఫ్‌లో కొన్ని సీన్స్, సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ ఆడియన్స్‌కి బోర్ కొట్టిస్తాయి. ముత్తులక్ష్మీతో శ్రేయ స్నేహం, వారి మధ్య వచ్చే రీపీటెడ్ సీన్స్‌తో సినిమా కదలిక లేకుండా వున్నట్టు అనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో పోలీసుల వ్యూహాలతో ఎలాంటి ఉపయోగం లేని సీన్స్‌తో సినిమా రన్ అవుతూ వుంటుంది. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు సినిమా చాలా స్పీడ్ అవుతుంది. ఒక అద్భుతమైన క్లైమాక్స్‌తో సినిమా ఎండ్ అవుతుంది. సినిమాలో చాలా మైనస్‌లు వున్నప్పటికీ వర్మ మార్క్ టేకింగ్‌తో, కొన్ని చోట్ల బోర్ కొట్టినా, కొన్ని సీన్స్ థ్రిల్ చేస్తాయి. ఫైనల్‌గా చెప్పాలంటే రామ్‌గోపాల్‌వర్మ ఈజ్ బ్యాక్ అనదగ్గ సినిమాగా ‘కిల్లింగ్ వీరప్పన్’ నిలుస్తుందని చెప్పవచ్చు.
జి.ఆర్.పిక్చర్స్, శ్రీకృష్ణ క్రియేషన్స్, జెడ్3 పిక్చర్స్
కిల్లింగ్ వీరప్పన్
నటీనటులు: శివరాజ్‌కుమార్, సందీప్ భరద్వాజ్, పరుల్ యాదవ్, యజ్ఞశెట్టి తదితరులు
సినిమాటోగ్రఫీ: రామ్మీ
సంగీతం: రవిశంకర్
ఎడిటింగ్: అన్వర్ అలీ
నిర్మాతలు: బి.వి.మంజునాథ్, ఇ.శివప్రకాష్, బి.ఎస్.సుధీంద్ర
రచన, దర్శకత్వం: రామ్‌గోపాల్‌వర్మ
విడుదల తేదీ: 07.01.2016
తెలుగు360.కాం రేటింగ్ 3/5