వీరప్పన్ చనిపోయి 11 సంవత్సరాలు దాటింది. కానీ, వీరప్పన్ బ్రతికే వున్నాడా? ఈ కొత్త సంవత్సరంలో వీరప్పన్ మళ్ళీ మన ముందుకు వచ్చాడా? అనిపించేలా ఇప్పుడు ఓ వ్యక్తి థియేటర్లలో హడావిడి చేస్తున్నాడు. అతనెవరో కాదు ‘కిల్లింగ్ వీరప్పన్’ చిత్రంలో వీరప్పన్ క్యారెక్టర్ చేసిన సందీప్ భరద్వాజ్. అతన్ని చూసిన ఎవరికైనా వీరప్పన్ క్యారెక్టర్ కోసం సందీప్‌ని తీసుకోవాలన్న ఆలోచన వర్మకి ఎలా వచ్చింది అని ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఒరిజినల్‌గా సందీప్ భరద్వాజ్ కలర్గానీ, కళ్ళుగానీ, హెయిర్ స్టైల్‌గానీ వేరు. ఏ విధంగానూ వీరప్పన్ పోలికలు మనకు కనిపించవు. కానీ, రామ్‌గోపాల్‌వర్మకి అతనిలో వీరప్పన్ కనిపించాడు. ఆలోచన వచ్చిందే తడవుగా అతనికి మేకప్ చేయించి ఒరిజినల్ వీరప్పన్ని సృష్టించాడు. వీరప్పన్‌నే మళ్ళీ చూస్తున్నామా అనే ఫీలింగ్‌ని కలిగించాడు వర్మ. ‘కిల్లింగ్ వీరప్పన్’ సినిమా చూసిన ప్రతి ఒక్కరి మాటా ఇదే. సందీప్‌కి మేకప్ చేయించి అతనిలో వీరప్పన్ని చూసుకున్న వర్మ అక్కడితో ఆగకుండా అతనితో టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ చేయించాడు. సినిమా చూస్తున్నంత సేపు ఒక ఆర్టిస్టుని కాక వీరప్పన్‌నే చూస్తున్న ఫీలింగ్ ఆడియన్స్‌కి కలిగించడంలో సందీప్ కృషి కూడా ఎంతో వుంది. అతని బాడీ లాంగ్వేజ్‌గానీ, లుక్‌గానీ దానికి తగ్గట్టుగా మలచుకొని వర్మ ముందు వీరప్పన్లా నిలబడ్డాడు. ‘కిల్లింగ్ వీరప్పన్’ చిత్రంలో శివరాజ్‌కుమార్ పెర్ఫార్మెన్స్కి ఏమాత్రం తగ్గకుండా సందీప్ భరద్వాజ్ వీరప్పన్ క్యారెక్టర్ని అద్భుతంగా పోషించాడు. వీరప్పన్ క్యారెక్టర్ చేసిన సందీప్‌కి మంచి అప్లాజ్ వస్తోంది. సందీప్‌లో వీరప్పన్ని చూసిన వర్మ, అతన్ని వీరప్పన్లా తీర్చిదిద్దిన మేకప్మేన్లకు ఆ క్రెడిట్ దక్కుతుంది.