సిని పరిశ్రమలో హీరోల మీద ఏడ్చే వ్యక్తులు వీరు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేకపోయినా.. పని పాట లేకుండా ఊరికే ప్రెస్ మీట్ పెట్టి స్టార్ హీరోల మీద, వారు తీసుకునే పారితోషికం మీద గొడవ చేసే గ్యాంగ్ టాలీవుడ్లో ఉంది. సందర్భాన్ని బట్టి వీరు స్టార్ హీరోలను టార్గెట్ చేస్తుంటారు. అయితే ఈసారి మన దగ్గర కాకుండా కోలీవుడ్లో ఈ వ్యవహారం మీద అక్కడ హీరో, నిర్మాత ఉదయనిధి స్టాలిన్ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
ముందు కమల్ హాసన్, సూర్య సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి ఆ తర్వాత తను హీరోగా మారి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలు చేస్తున్నాడు స్టాలిన్. కెరియర్ లో రెండు మూడు హిట్లు పడే సరికి తాను కూడా యాక్షన్ ఇమేజ్ కోసం ఇప్పుడు ‘గెత్తు’ అనే యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులముందుకు రానున్నాడు. రీసెంట్ గా ఉదయనిధి స్టాలిన్ ఇచ్చిన ఇంటర్వ్యూల్లో సినిమా రంగం నష్టపోడానికి కారణం స్టార్ హీరోలా పారితోషికం పెద్ద కారణం అని అన్నాడు.
అగ్ర హీరోలు భారీగా పారితోషికం తీసుకోబట్టే సినిమా బడ్జెట్ కూడా పెరిగిపోతుందని సినిమా ఫ్లాప్ అయితే నిర్మాత నష్టాలు పడాల్సి వస్తుందని తన అభిప్రాయాపడ్డాడు. అయితే తను ఓ నిర్మాతగా ఆలోచించి ఈ మాట అన్నాడేమో కాని.. స్టార్ సినిమా అంటే వారు తీసుకునే రెమ్యునరేషన్ వారి సినిమాలు కలెక్ట్ చేసే వసూళ్లతో కవర్ చేస్తుందని అతనికి తెలియదా అని అంటున్నారు సిని జనాలు.