ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో డైరెక్టర్‌గా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకొని ఎవరూ టచ్ చెయ్యని సబ్జెక్ట్స్‌ని, ఎవ్వరూ చెయ్యని ఎటెమ్ట్స్తో రామ్‌గోపాల్‌వర్మ అనే బ్రాండ్‌ని క్రియేట్ చేసుకున్న వర్మ గత కొంతకాలంగా కొన్ని పనికిమాలిన సినిమాలు చేస్తూ తన ఇమేజ్‌ని తనే దిగజార్చుకున్న విషయం తెలిసిందే. ఆమధ్య ‘రక్తచరిత్ర’ సిరీస్‌తో తన గ్రాఫ్‌ని కొంత పెంచుకునే ప్రయత్నం చేసినా ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలు అతన్ని పాతాళానికి నెట్టేశాయా అన్నంత పని చేశాయి. అయితే కన్నడలో శివరాజ్‌కుమార్‌తో ‘కిల్లింగ్ వీరప్పన్’ అనే సినిమా చేస్తున్నాడన్న వార్తలు బయటికి వచ్చాక కూడా వర్మ కొత్తగా చూపించేది ఏముందిలే అని అందరూ పెదవి విరిచారు. ఎప్పుడైతే ఈ సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేశారో వర్మ ఈజ్ బ్యాక్ అని అతన్ని అభిమానించే వారు ఆనందపడ్డారు. చాలా వాయిదాల తర్వాత ఎట్టకేలకు జనవరి 1న కన్నడలో, జనవరి 7న తెలుగులో రిలీజ్ అయిన ‘కిల్లింగ్ వీరప్పన్’కి చాలా అప్లాజ్ వస్తోంది. ముఖ్యంగా వర్మ టేకింగ్ ఒకప్పటి స్థాయిలో అందర్నీ మెస్మరైజ్ చేసే స్థాయిలో వుందని అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.
‘కన్నడలో వీరప్పన్ నేపథ్యాన్ని ఎంచుకొని సినిమా స్టార్ట్ చేశావు. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవ్వాలి.. లేదా నువ్వు చచ్చావే’ అంటూ అతన్ని కొందరు బెదిరించారు. ఎవ్వరి బెదిరింపులకూ లొంగని వర్మ తన పద్ధతి ప్రకారమే సినిమా తీశాడు. అది కన్నడలో పెద్ద హిట్ అయింది. ఇప్పటివరకు అలాంటి టేకింగ్‌ని, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ని, సౌండ్ ఎఫెక్ట్స్‌ని చూడని కన్నడ ప్రేక్షకులు థ్రిల్ అయిపోతున్నారట. ఇంతకీ వర్మని చంపేస్తామని బెదిరించిన వారెవరు? అంటే ‘కిల్లింగ్ వీరప్పన్’ యూనిట్ సభ్యులే. చివరికి సినిమా పెద్ద హిట్ అయిపోవడంతో వర్మతో కలిసి యూనిట్ సభ్యులంతా పెద్ద పార్టీ చేసుకున్నారు. అదీ సంగతి