‘సర్దార్ గబ్బర్‌సింగ్’ యూనిట్‌ని అంతగా టెన్షన్ పెట్టిన విషయం ఏమిటి? అంటే హైదరాబాద్‌లో గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవ్వడంతో వివిధ రాజకీయ పార్టీలు తమ తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. టిఆర్ఎస్, కాంగ్రెస్, తెలుగుదేశం, బిజెపి.. ఇలా అన్ని పార్టీలూ తమ ప్రచార వ్యూహాల్ని రచిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు, విజయం సాధించేందుకు ఎవరెవరిని రంగంలోకి దించాలి అనే దానిపై సుదీర్ఘంగా చర్చిస్తున్నాయి పార్టీలు. ముఖ్యంగా తెలుగుదేశం, బిజెపిలు ఈ విషయంలో ఒకే ఒక వ్యక్తిపైన తమ ఆశలన్నీ పెట్టుకున్నాయి. అతనే పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్. పవర్‌స్టార్ ఛరిష్మా గత ఎన్నికల్లో తెలుగుదేశం, బిజెపిలకు బాగా ఉపయోగపడింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ పవన్‌కళ్యాణ్‌నే రంగంలోకి దించాలని ఆ పార్టీలు భావించాయి. ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో, ఏది ఔనంటాడో, ఏది కాదంటాడో తెలీని పవన్‌కళ్యాణ్ ఇప్పుడు ఈ ప్రచారానికి మాత్రం ‘నో’ అని చెప్పాడని తెలిసింది. ప్రచారంలో పాల్గొనను అని ఖరాఖండీగా చెప్పడం వెనుక కారణం ఏమిటో తెలీదుగానీ పవన్‌కళ్యాణ్ మాత్రం ఎన్నికల ప్రచారంలో పాలుపంచుకోవడం లేదు. తమ హీరో ప్రచారానికి ఎక్కడ ‘ఎస్’ అంటాడోనని, సినిమా ఇంకా ఎంత లేట్ అవుతుందోనని టెన్షన్ పడ్డ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ యూనిట్ మెంబర్స్ ‘హమ్మయ్య’ అంటూ ఊపిరి పీల్చుకున్నారట.