తాజా సమాచారం ప్రకారం ఈనెల 15వ తేదీన ఇస్లామాబాద్ లో జరుగవలసిన భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శుల సమావేశాన్ని భారత ప్రభుత్వం రద్దు చేసుకొన్నట్లు తెలుస్తోంది. జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ కొద్ది సేపటి క్రితం డిల్లీలో ఈ ప్రకటన చేసినట్లు సమాచారం. పఠాన్ కోట్ పై దాడికి పాల్పడిన ఉగ్రవాద ముఠాలపై, వ్యక్తులపై పాక్ ఇంతవరకు ఎటువంటి కటినమయిన చర్యలు చేపట్టకపోవడంతో భారత్ తీవ్ర అసంతృప్తికి గురయిందని, వారిపై చర్యలు చేపట్టే వరకు భారత్-పాక్ మధ్య చర్చలు జరగవని ఆయన మీడియాకి తెలిపారు. పఠాన్ కోట్ దాడికి కుట్ర పన్నిన వారిపై పాక్ ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందని ఎదురుచూస్తున్నామని ఆయన మీడియాకు తెలిపారు.