యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమానే కాదనే ఖలేజా ఎవరికి ఉందా అన్నది మీ డౌట్ కావొచ్చు. అవునండి మహేష్ బాబు 1 నేనొక్కడినే సినిమాలో హీరోయిన్ గా నటించిన మోడలింగ్ బ్యూటీ కృతి సనన్ తారక్ సినిమాకు సారీ చెప్పేసిందట. ప్రస్తుతం నాన్నకు ప్రేమతో విడుదలకు రెడీగా ఉన్న ఎన్టీఆర్, శ్రీమంతుడు దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ‘జనతా గ్యారేజ్’ సినిమా చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే..
ఆ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ అవసరముండగా ఇప్పటికే సమంత మొదటి హీరోయిన్ గా ఓకే అయ్యింది. ఇక రెండో భామగా కృతి సనన్ ని అడిగారట. అయితే ఎన్టీఆర్ తో సినిమా అవకాశం వచ్చినా అమ్మడు అవతల బాలీవుడ్ సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల తప్పక కుదరదన్నదట. ఈ మధ్యే షారుఖ్ దిల్ వాలే సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రాతో జోడీ కట్టిన కృతికి అక్కడ మంచి మార్కులే పడ్డాయి.
మరి కృతి కాదన్నది కాబట్టి ఇప్పుడు గ్యారేజ్ రెండో భామ కోసం వేట కొనసాగిస్తున్నారట చిత్ర యూనిట్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ మరోసారి తన మాస్ ఇమేజ్ ను ఆవిక్షరించబోతున్నాడని అంటున్నారు.