దేవదాస్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు రామ్. నిర్మాత స్రవంతి రవికిశోర్ అండదండలతో పరిశ్రమలో అడుగుపెట్టినా తన స్వశక్తితో ఎనర్జిటిక్ స్టార్ గా ఎదిగాడు. 2006 జనవరి 11న వై.వి.ఎస్ చౌదరి దర్శక నిర్మాతగా తీసిన దేవదాస్ సినిమాతో తెరంగేట్రం చేసిన రామ్ దశాబ్ద కాలంలో 13 సినిమాలు చేయగా అందులో నాలుగు హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.
కొద్దికాలంగా కెరియర్ విషయంలో ఆటు పోట్లు ఎదుర్కుంటున్న రామ్ ఈ సంవత్సరం మొదటి రోజున విడుదలైన నేను శైలజ మూవీ హిట్ మంచి కిక్ ఇచ్చింది. తానెలాంటి సినిమాలు చేస్తే వర్క్ అవుట్ అవుతుందో.. ఎలాంటి పాత్రల్లో ప్రేక్షకులు, అభిమానులు తనని చూడాలనుకుంటున్నారో కరెక్ట్ గా నేను శైలజ సినిమాతో తెలిసింది. రామ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే దిశగా వసూళ్లను రాబడుతుంది నేను శైలజ.
‘నా జీవితంలో పది అందమైన సంవత్సరాలు.. మీ ప్రేమ అనురాగమే నన్ను ఈ స్థాయికి చేర్చింది… మీ రుణం తీర్చుకునేందుకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా’ అంటూ రామ్ పెట్టిన ట్విట్టర్ మెసేజ్ అందరిని బాగా ఆకట్టుకుంటుంది. మరి పదేళ్ల పండుగ చేసుకుంటున్న రామ్ భవిష్యత్తులో మరిన్ని విజయాలను నమోదు చేసుకోవాలని కోరుకుందాం.