నాని హీరోగా, మెహరీన్ హీరోయిన్గా హను రాఘవపూడి దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర ప్రొడక్షన్ నెం.7గా నిర్మిస్తున్న మూవీ ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’. నాని లేటెస్ట్ మూవీ ‘భలే భలే మగాడివోయ్’ సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఈచిత్రం తర్వాత నాని చేస్తున్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి ఎక్స్పెక్టేషన్స్ వున్నాయి. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు, టైటిల్ కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ స్కూల్ నుంచి వచ్చిన విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.
ఈ చిత్రం ఆడియోను లహరి మ్యూజిక్ విడుదల చేస్తోంది. ఈ ఆడియో ఫంక్షన్‌ని జనవరి 18న హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో చాలా వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఆడియో ఫంక్షన్‌కి ముఖ్య అతిథిగా సూపర్‌స్టార్ మహేష్ అటెండ్ అవుతున్నాడని తెలిసింది. ఆడియో ఫంక్షన్లకు చాలా రేర్‌గా వచ్చే మహేష్ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్లో మూడు సినిమాలు చెయ్యడం, ఆ సంస్థ నిర్మాతలతో మహేష్‌కి సత్సంబంధాలు వుండడంతో ఈ ఫంక్షన్‌కి వచ్చేందుకు ఓకే చెప్పాడట. అంతేకాకుండా నాని అంటే మహేష్‌కి ఓ ప్రత్యేకమైన అభిమానం వుండడం కూడా అతను ఈ ఫంక్షన్‌కి అటెండ్ అవ్వడానికి మరో కారణమైంది.
14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ‘లెజెండ్’, ‘1 నేనొక్కడినే’, ‘ఆగడు’ వంటి మ్యూజికల్ హిట్స్‌ని రిలీజ్ చేసిన తమ సంస్థ ద్వారా ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ ఆడియోను కూడా రిలీజ్ చెయ్యడం చాలా ఆనందంగా వుందని లహరి మ్యూజిక్ అధినేత జి.మనోహర్‌నాయుడు అంటున్నారు. 14 రీల్స్ బేనర్‌పై నిర్మించిన ‘లెజెండ్’ చిత్రం నుంచి వరసగా అన్ని ఆడియోలు తమ ఆడియో కంపెనీ ద్వారానే రిలీజ్ చేస్తున్నామని, ఇప్పుడు ఈ చిత్రం ఆడియో కూడా తమకే ఇచ్చి ప్రోత్సహిస్తున్న నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకరలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని లహరి మ్యూజిక్ అధినేత జి.మనోహర్‌నాయుడు అన్నారు.