హైదరాబాద్: సెక్షన్ 8 అమలుకు అంగీకరించేది లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్కు తెగేసి చెెప్పారు. ఆయన ఇవాళ ఉదయం రాజ్భవన్లో గవర్నర్ను కలిశారు. హైదరాబాద్ నగరంలో ఏడాదికాలంగా శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగలేదని, ఆంధ్రావారిమీద ఎక్కడా దాడులు జరగలేదని చెప్పారు. పరోక్షపాలనకు అంగీకరించబోమని కేసీఆర్ స్పష్టం చేశారు.
సెక్షన్ 8ను అమలు చేసే అధికారం గవర్నర్కు ఉందని అటార్నీ జనరల్ రోహత్గీ నిన్న సలహా ఇవ్వటంతో వివాదాన్ని పరిష్కరించటానికి నరసింహన్ రంగంలోకి దిగారు. ఇవాళ ఇద్దరు సీఎమ్లను విడివిడిగా మాట్లాడటానికి పిలిచారు. ఉదయం కేసీఆర్ కలవగా, చంద్రబాబు అపాయింట్మెంట్ మాత్రం ఇంకా ఖరారు కాలేదు.