ఈరోజు జి.హెచ్.ఎం.సి. ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. వెంటనే నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభం అయ్యింది. ఎన్నికల షెడ్యూల్ ఈవిధంగా ఉంది.
నామినేషన్ల స్వీకరణ: జనవరి 12-17వ తేదీ వరకు. సంక్రాంతి పండుగ సందర్భంగా మద్యలో 14, 15 తేదీలలో శలవు ఉంటుంది కనుక ఆ రెండు రోజులు నామినేషన్లు స్వీకరించరు. అంటే నామినేషన్లు వేసేందుకు కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంటుంది. నామినేషన్ల దాఖలు చేసేందుకు, ఉపసంహరించుకొనేందుకు ఉదయం 11గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే సమయం ఉంటుంది.
జనవరి 18న నామినేషన్ల పరిశీలన చేస్తారు. జనవరి 19 నుండి 21వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకి గడువు. ఫిబ్రవరి 2న పోలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 5వ తేదీన ఓట్ల లెక్కింపు చేసి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు.