కాంగ్రెస్ లోకి జంప్ అయిన మాజీ తే దా పా నేత రేవంత్ రెడ్డికి అనూహ్యమైన వైపు నుంచి మద్దతు లభిస్తున్నట్టుంది. తనకు పార్టీలో నాయకత్వానికి ప్రత్యర్థిగా చొచ్చుకొచ్చిన రేవంత్ గెలిచేందుకు తాను కృషి చేస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు అసెంబ్లీ లాబీ లో శుక్రవారం మాట్లాడుతూ… ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలిస్తేనే రేవంత్ కు గౌరవంగా ఉంటుంది అన్నారు. కోడo గల్ లో ఉప ఎన్నిక వస్తే తామంతా కలసికట్టుగా కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ ను గెలిపించి తీరుతామని చెప్పారు. ప్రభుత్వం ఎన్ని ప్రలోభాలకు పాల్పడినా ఎదుర్కుని గెలుస్తాం అని స్పష్టం చేశారు. తమ పార్టీ లో అధిష్ఠానం నుంచి పాదయాత్ర కు అనుమతి దొరకదని అన్నారు. ఒకవేళ అలా ఇచ్చి ఉంటే తానెపుడో పాదయాత్ర చేసేవాడిని అన్నారు.
కేసీఆర్ పాలన పై ప్రజల్లో వ్యతిరేకత ఉందంటున్న కోమటిరెడ్డి… ఈ పాలన చూస్తుంటే రాజకీయ వైరాగ్యం కలుగుతోంది అన్నారు. రేవంత్ రాకను జీర్ణించుకోలేని నేత ల్లో ఒకరుగా పేరున్న కోమటిరెడ్డి… మాట్లాడిన మాటల వెనుక రకరకాల అర్ధాలను తీస్తున్నారు విశ్లేషకులు.
అన్యాపదేశంగా రేవంత్ ను ఎన్నికల వైపు పురికొల్పే యత్నo, ఒకవేళ ఓడితే రేవంత్ కు సీనింతే అని అనొచ్చు. అలా కాక గెలిస్తే కాంగ్రెస్ గెలిపించిoదని… అనొచ్చు. అలాగే తన పాదయాత్ర కు అనుమతి ఇవ్వలేదని గుర్తు చేస్తూ… ఇప్పుడు రేవంత్ కి ఎలా ఇస్తారoటూ పరోక్షంగా అధిష్ఠానం ను ప్రశ్నించడం… ఇలాంటి ఆలోచనలు కోమటిరెడ్డి మాటల వెనుక ఉండొచ్చు నని అంచనా వేస్తున్నారు.