మంచు మనోజ్ నటించిన `ఒక్కడు మిగిలాడు` శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. కమర్షియల్ పంథాకు దూరంగా వెళ్లి.. ఓ కథని తెరకెక్కించాలన్న ఆలోచన బాగుంది గానీ, దర్శకుడి రాత – తీత సరిగా కుదరక మనోజ్ కష్టం… శ్రీలంక సముద్రం పాలైంది. ఈ సినిమాతో నిర్మాతలకూ భారీ నష్టాలూ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతలో కొంత శాటిలైట్ రూపంలో కొంత మొత్తం గిట్టుబాటు అయ్యే ఛాన్సుంది. తెలుగు, హిందీ శాటిలైట్ రూపంలో ఈ సినిమాకి రూ.4 కోట్ల వరకూ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాకి పెట్టుబడి రూ.7 నుంచి రూ.8 కోట్లు అయ్యిందని లెక్క. కానీ.. తెరపై అంత ఖర్చు కూడా కనిపించడం లేదు. సముద్ర నేపథ్యంలో తెరకెక్కించిన భారీ ఎపిసోడ్‌ని బాగా ఖర్చయిందని ఇంత వరకూ నిర్మాతలు చెప్పుకొచ్చారు. అయితే ఆ సన్నివేశాల్ని తమిళ సినిమాలో వాడినవే. సో.. బడ్జెట్ కూడా రూ.5 కోట్లలోపే ఉంటుందని ట్రేడ్ వర్గాలు లెక్కగడుతున్నాయి. శాటిలైట్ లెక్కలన్నీ నిజమైతే నిర్మాతలకు నష్టభారం తగ్గినట్టే.