రాజశేఖర్ – ప్రవీణ్ సత్తారుల గరుడ వేగ బాక్సాఫీసు దగ్గర హిట్ టాక్ తెచ్చుకొంది. సినీ ప్రముఖుల ప్రశంసలూ అందుకొంటోంది. గరుడ వేగ సూపర్బ్ అంటూ హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఈ టీమ్ ఎఫెక్ట్‌ని మెచ్చుకొంటున్నారు. ఇప్పుడు మహేష్ బాబు కితాబులూ అందుకొన్నాడు. స్క్రిప్టు వర్క్ గొప్పగా ఉందని, నటీనటుల ప్రతిభ మెచ్చుకొనేలా ఉందని, స్క్రీన్ ప్లే నచ్చిందని మహేష్ కాంప్లిమెంట్స్ అందిస్తూ ఓ ట్వీట్ చేశాడు. రాజశేఖర్, ప్రవీణ్ సత్తారులను ప్రత్యేకంగా అభినందించాడు. ఈ ట్వీట్ తో చిత్రబృందం పులకించిపోతోంది. గత వారం విడుదలైన గరుడవేగ వసూళ్లు ఈ వారం కాస్త నెమ్మదించాయి. కొత్త సినిమాలు రావడంతో.. గరుడ వేగ స్పీడుకు బ్రేకులు పడ్డాయి. మహేష్ ట్వీట్‌తో వసూళ్లకు పునరుత్తేజం వస్తుందేమో చూడాలి.
Great script… Good performances… Slick screenplay… #PSVGarudaVega is stunning… Amazing work by the entire team. Take a bow @ActorRajasekhar & director @PraveenSattaru !
— Mahesh Babu (@urstrulyMahesh) November 11, 2017