జనసేనాని వస్తున్నాడట. అన్ని రకాల అస్త్ర శస్త్రాలు సిద్ధం చేస్తున్నాడు. జన సేవే లక్ష్యం గా జనసేన కు రూపం ఇస్తున్నాడు. ఇదే శనివారం తెలిసిన ‘ పవర్’ పాలిటిక్స్ తాజా కబుర్ల సారాంశం.
తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ ని సమాయత్తం చేసే క్రమంలో జిల్లాల వారీగా పార్టీ సమన్వయ కర్తలను ఎంపిక చేస్తోంది. శనివారం విజయవాడ నగరంలో సమన్వయకర్త ఎంపిక కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా పార్టీ మీడియా హెడ్ హరి ప్రసాద్ మాట్లాడుతూ.. త్వరలో నియోజకవర్గ సమన్వయకర్త ల నియామకాలు కూడా జరుగుతాయని, పార్టీ అధినేత పవన్ కృష్ణా జిల్లాలో పర్యటించనున్నాడని చెప్పారు. పార్టీ రూపు రేఖలపై పవన్ విస్తృత కసరత్తు చేస్తున్నారని, బ్లూ ప్రింట్ కూడా సిద్ధం అయ్యిందని తెలిపారు. పార్టీలో యువత మేధావులకు ప్రాధాన్యం ఇస్తున్నామని, తమ పార్టీ లక్ష్యం అధికారం కాదని ప్రజా సమస్యల పరిష్కారం అని స్పష్టం చేశారు.