ప్రస్తుతం రాజకీయాలకు తాత్కాలిక ‘అజ్ఞాతవాసి’ గా మారిన హీరో కమ్ పొలిటీషియన్… పవన్ కల్యాణ్ ప్రత్యక్షo గా ఉద్యమిoచాలనే డిమాండ్ మరోసారి పురుడు పోసుకుంది. దీనితో పాటే ప్రత్యేక హోదా ఉద్యమం కూడా. కేంద్రం ఆoద్ర ప్రదేశ్ కు న్యాయం గా దక్కాల్సిన విభజన హామీలు, చేయాల్సిన సహాయం విషయంలో అనుసరిస్తున్న వైఖరిపై కర్నూలులో అన్ని పార్టీల రౌండ్ టేబుల్ సమావేశo నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ నేత రామకృష్ణ, నటుడు శివాజీ, ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్…. తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జన సేనాని ప్రత్యక్ష ఉద్యమం లోకి రావాలని వక్తల నుంచి బలమైన డిమాండ్ వచ్చింది. ప్రత్యేక హోదాపై ఈ నెల 20న ఛలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించిన రౌండ్ టేబుల్… ఛలో అసెంబ్లీ పోరు లో పవన్ పాల్గొనాలని కోరింది.
ఈ సందర్భంగా మాట్లాడిన నటుడు శివాజీ… జగన్, పవన్ లు కలిసికట్టుగా హోదా సాధన కు పోరాడాలని సూచించారు. తమ ఉద్యమానికి పవన్ మద్దతు ఇస్తే మరింత ఊపు వస్తుందని రామకృష్ణ అన్నారు. ఈ నేపథ్యంలో… ఆంద్రప్రదేశ్ లో అధికార విపక్షాల వైఖరి నచ్చని పలు పార్టీలు, సంఘాలు పవన్ ను ముందు ఉంచి పోరాటం సాగించాలనే ఆలోచన చేస్తున్నట్లు కనపడుతోంది. మరి ఈ డిమాండ్ పై పవర్ స్టార్ ఎలా స్పందిస్తాడో చూడాలి.