హైదరాబాద్: ఇంగ్లీష్ భాషలో ‘నేమ్ డ్రాపింగ్’ అని ఒక ఫ్రేజ్ ఉంది. ఎదుటివారిని ఇంప్రెస్ చేయటంకోసం – ఫలానా ప్రముఖుడు మాకు బంధువనో, బాగా తెలిసిన వ్యక్తి అనో చెప్పటాన్ని నేమ్ డ్రాపింగ్ అంటారు. మోహన్‌బాబు కుమార్తె, సుప్రసిద్ధ తెలుగు నటి, నిర్మాత, టీవీ షో హోస్ట్ మంచు లక్ష్మీప్రసన్న ఈ విద్యలో పీక్స్‌కు చేరుకున్నారు. సాక్షాత్తూ ఏడుకొండలవాడితోనే బంధుత్వం కలిపేశారు.
ఇటీవల మంచు లక్ష్మి చెల్లెమ్మ(ఆ బాలగోపాలానికీ చెల్లెమ్మే) భర్త శ్రీనివాస్, కుమార్తెతో కలిసి తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. ఎలాగైనా పేజ్ 3 సెలబ్రిటీ కదా, దర్శనం చేసుకుని బయటకు రాగానే మన మీడియా వాళ్ళు వెళ్ళిపోయి మాట్లాడమంటూ గొట్టాలు పెట్టారు. తనకు వెంకటేశ్వరస్వామి అంటే చాలా ఇష్టమని మంచు లక్ష్మి ముద్దు ముద్దుగా వచ్చీరాని తెలుగులో(?!?) చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత చెప్పిన విషయానికి అక్కడున్నవారందరూ, టీవీలలో చూసేవారందరూ ఢామ్మని పడిపోయారు. వెంకటేశ్వరస్వామిని తాను పెదనాన్నగా అనుకుంటూ ఉంటానని లక్ష్మి తెలిపారు. అయితే మనకు భగవంతుడితో ఏమైనా పని ఉంటే మోహన్‌బాబుగానీ, ఆయన కుటుంబసభ్యుల ద్వారా గానీ పైరవీ చేసుకోవచ్చన్నమాట! మంచు లక్ష్మి మాటలను చూడాలంటే ఈ క్రింద చూడొచ్చు.
https://www.youtube.com/watch?v=wezr0rR5nRA