హైదరాబాద్: అనుకున్నట్లే అయింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై కొద్దిరోజులుగా డైలమాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంనుంచి తప్పుకోవాలని నిర్ణయించింది. పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ హైదరాబాద్లో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేయకూడదని పార్టీ నిర్ణయించిందని తెలిపారు. ముందు తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తామని ఇవాళ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీలన్నీ డబ్బులు వెదజల్లి గెలవాలని ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించింది. మరోవైపు ఈ నిర్ణయంతో ఎన్నికల్లో పోటీ చేద్దామనుకుంటున్న నగరంలోని వైసీపీ నాయకులు ఆశాభంగానికి గురయ్యారు. ఒకవైపు సోదరి షర్మిలను తెలంగాణలో ఓదార్పుయాత్రలు చేయిస్తున్న జగన్, గ్రేటర్ ఎన్నికలనుంచి వైదొలగాలని నిర్ణయించటానికి కారణం ఏమిటో తెలియటంలేదు.