హైదరాబాద్: కుమార్తె కవితకు కేంద్రమంత్రి వస్తేనే కేసీఆర్ దృష్టిలో సంపూర్ణ తెలంగాణ సిద్ధించినట్లని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర నర్సింహ అన్నారు. టీఆర్ఎస్ నేతలు తమ పార్టీ సమస్యలను ప్రజాసమస్యలుగా చిత్రీకరించి కొత్తసమస్యలను తీసుకొస్తున్నారని విమర్శించారు. మరోవైపు ఎమ్ఐఎమ్ పార్టీపైనా దామోదర విరుచుకుపడ్డారు. ఆ పార్టీకి సిద్ధాంతమంటూ ఏమీ లేదని, ఏ పార్టీ అధికారంలో ఉంటే వారితో జట్టుకడుతుందని అన్నారు. ముస్లిమ్‌లకు 12శాతం రిజర్వేషన్లపై టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎమ్ఐఎమ్ ఎందుకు ప్రశ్నించటంలేదని అడిగారు. ఎమ్ఐఎమ్తో టీఆర్ఎస్ దోస్తీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలవరకే ఉంటుందని, తర్వాత బీజేపీతో కేసీఆర్ జట్టుకడతారని దామోదర జోస్యం చెప్పారు.