అన్నపూర్ణ స్టూడియోస్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించడం, దాదాపు రెండు కోట్ల నష్టం వచ్చిందని స్వయంగా నాగార్జున ప్రకటించడం తెలిసిన సంగతులే. ఈ ప్రమాదం జరిగి ఇంకా 24 గంటలు కూడా గడవలేదు, అప్పుడే నాగ్ – సినిమా పనుల్లో నిమగ్నమైపోయాడు. అఖిల్ కొత్త సినిమా ‘హలో’ ప్రమోషన్లను ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి మొదలైపోతాయని నాగ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించాడు. ”ఈ వారమంతా భావోద్వేగంతో సాగిపోయింది. ఏడ్చాం, నవ్వాం. ఇప్పుడు ‘హలో’ సినిమా ప్రచార కార్యక్రమాలకు సన్నద్ధం అవుతున్నాం. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రచార కార్యక్రమం మొదలవుతుంది” అని ట్వీట్లో పేర్కొన్నారు. కొత్త కోడలు సమంత రాకతో, అక్కినేని కుటుంబంలో సంబరాలు మొదలయ్యాయి. వరుసగా పార్టీలు చేసుకొంటున్నారు. ఆదివారం ఘనంగా రిసెప్షన్ కూడా నిర్వహించారు. మరుసటి రోజే అగ్నిప్రమాదం సంభవించింది. తనకు ఇష్టమైన ‘మనం’ సెట్ మంటల్లో కాలి బూడిదైంది. అయినా సరే, మరుసటి రోజే…. సినిమా పనుల్లో పడిపోయి అందరినీ ఆశ్చర్యపరిచాడు నాగ్. పైగా తన మిక్స్డ్ ఎమోషన్స్‌ని బయటపెడుతూ, ట్వీట్ చేయడం కూడా నాగ్ స్పోర్టింగ్ స్పిరిట్‌ని చూపిస్తోంది. గో ఎహెడ్ నాగ్…!!
Hello my friends, it’s been a emotional week!! We laughed and we cried and now we are ready to kickstart #Hello promotions this afternoon 2 pm?
— Nagarjuna Akkineni (@iamnagarjuna) November 14, 2017