విక్రమ్ కె.కుమార్ కథలన్నీ కొత్తగా ఉంటాయి. ఒక్క ‘ఇష్క్’ మినహాయిస్తే… మిగిలిన సినిమాలన్నీ కొత్త కొత్త పాయింట్లతో సాగినవే. మరీ ముఖ్యంగా 13 బి, మనం, 24 సినిమాలతో షాక్ ఇచ్చాడు. ఇప్పుడు అఖిల్‌తో హలో అనిపిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై తీర్చిదిద్దిన చిత్రమిఇ. డిసెంబరులో విడుదల కాబోతోంది. అందుకే ప్రమోషన్స్ గంట కూడా కొట్టేశారు. టీజర్‌ని ఈనెల 16న విడుదల చేయబోతున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ విడుదల చేసింది చిత్రబృందం. ఫస్ట్ లుక్‌లో గోడపై కాలుపెట్టి గాల్లో లేచిన అఖిల్… ఈసారీ ఆకాశంలోనే ఉన్నాడు. హలో అనే టైటిల్‌కి తగ్గట్టు సెల్ ఫోన్లు కనిపిస్తున్నాయి. సెల్ ఫోన్, సోషల్ నెట్ వర్కింగ్ సిస్టమ్ ఆధారంగా సాగే కథేమో అనే అనుమానాలకు లేటెస్ట్ స్టిల్ బలాన్ని చేకూరుస్తోంది. 16న టీజర్ వచ్చేస్తోంది కదా, కాన్సెప్ట్ ఏంటో అప్పుడు తెలిసిపోతుంది లెండి. అప్పటి వరకూ కాస్త ఓపిక పట్టాలి. డిసెంబరు 22న ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది నాగ్ ప్లాన్. ఆడియో డిసెంబరు మొదటి వారంలో బయటకు వస్తుంది.