నంది అవార్డుల విజేతల లిస్టు ఒకొక్కటిగా బయటకు వస్తోంది. మూడేళ్ల అవార్డులు ఒకేసారి ఇచ్చారు కాబట్టి, దాదాపు హీరోలందరినీ కవర్ చేసే అవకాశం వచ్చేసింది. అయితే అవార్డులపై టీడీపీ ఎఫెక్ట్ బాగా కనిపిస్తున్నట్టు అనిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ టీడీపీ మనిషి అని ప్రత్యేకంగా చెప్పాల్సినపనిలేదు. ఆయన సినిమా ‘లెజెండ్’కి బోలెడన్ని అవార్డులొచ్చాయి. 2014 కిగానూ ఉత్తమ నటుడిగా బాలకృష్ణ ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రం కూడా అదే. దర్శకుడిగా బోయపాటి, ఉత్తమ ప్రతినాయకుడిగా జగపతిబాబు, ఉత్తమ నేపథ్య గాయకుడిగా విజయ్ ఏసుదాస్, ఉత్తమ మాటల రచయితగా రత్నం, ఎడిటర్‌గా కోటగిరి ఈ చిత్రానికే నందులు అందుకోబోతున్నారు. ఉత్తమ చిత్రం విభాగంలో ‘మనం’ గట్టిపోటీ ఇచ్చింది. ఆయేడాది కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఏదైనా ఉందీ అంటే అది మనం మాత్రమే. లెజెండ్‌లో హింస, రక్తపాతం, రాజకీయ భావజాలం ఎక్కువగా కనిపించాయి. అలాంటి సినిమాకి అవార్డు ఇచ్చి, మనంని ద్వితీయ ఉత్తమ చిత్రంగా పరిమితం చేయడం ఏమిటో?? బోయపాటి శ్రీను నారా చంద్రబాబు నాయుడుకి సన్నిహితుడే. పుష్కరాల సమయంలో… తన క్రియేటీవ్ ఇన్ పుట్స్ చాలా ఇచ్చాడు. అందుకు కృతజ్ఞత కూడా చూపించినట్టైంది టీడీపీ ప్రభుత్వం. లెజెండ్ సినిమాకి గానూ నంది అవార్డుల్ని కట్టబెట్టడమే కాకుండా… 2016 బి.ఎన్ రెడ్డి పురస్కారాన్ని బోయపాటికి అందివ్వబోతోంది. మరి ఇదంతా పచ్చ పార్టీ ఎఫెక్ట్ కాదంటారా???
[pdf-embedder url=”https://www.telugu360.com/wp-content/uploads/2017/11/Nandi-Awards-2014-Winners-List-.pdf” title=”Nandi Awards 2014 Winners List”]
[pdf-embedder url=”https://www.telugu360.com/wp-content/uploads/2017/11/AP-Nandi-Awards-2015-Winners-List-.pdf.pdf” title=”AP Nandi Awards 2015 Winners List .pdf”]
[pdf-embedder url=”https://www.telugu360.com/wp-content/uploads/2017/11/AP-Nandi-Awards-2016-Winners-List-.pdf” title=”AP Nandi Awards 2016 Winners List”]